పుష్ప 2 - కల్కిని కూడా కొట్టేసిందిగా..
'పుష్ప 2' మూవీ కేవలం 11 రోజుల్లోనే 190 కోట్ల షేర్ ని అందుకొని కల్కి రికార్డ్ ని దాటేసింది. 12వ రోజు ఈ సినిమా 195 కోట్ల షేర్ ని దాటేసింది.
'పుష్ప 2' మూవీ ర్యాంపేజ్ రెండో వారంలో కూడా కొనసాగుతోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 1300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని దాటేసిన ఈ మూవీ లాంగ్ రన్ లో 1500 కోట్లు దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గ్రాస్ కలెక్షన్స్ పరంగా 'కల్కి2898ఏడీ', 'ఆర్ఆర్ఆర్' రికార్డులని బ్రేక్ చేసి 'బాహుబలి 2' తర్వాత స్థానంలోకి వచ్చేసింది. దేశంలోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న మూడో చిత్రంగా నిలిచింది.
ఇదిలా ఉంటే ఈ కలెక్షన్స్ ప్రభంజనం తెలుగు రాష్ట్రాలలో కూడా కనిపిస్తోంది. హిందీలో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ కొంత తక్కువగానే ఉన్నా కూడా ఇప్పటి వరకు ఈ మూవీ ఏకంగా 195 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. ఈ షేర్ పరంగా 'పుష్ప 2' మూవీ కల్కి లాంగ్ రన్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ చేసింది. 'కల్కి 2898ఏడీ' మూవీ లాంగ్ రన్ లో 187 కోట్ల షేర్ కలెక్షన్స్ ని అందుకుంది.
'పుష్ప 2' మూవీ కేవలం 11 రోజుల్లోనే 190 కోట్ల షేర్ ని అందుకొని కల్కి రికార్డ్ ని దాటేసింది. 12వ రోజు ఈ సినిమా 195 కోట్ల షేర్ ని దాటేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో అత్యధిక షేర్ అందుకున్న సినిమాల జాబితాలో పుష్ప టాప్ 3లో ఉంది. దీనికంటే ముందు 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి 2' సినిమాలు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో ఈ రెండు సినిమాలు మాత్రమే 200 కోట్ల షేర్ మార్క్ ని దాటాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి 'పుష్ప 2' కూడా రానుంది.
హిందీలో ఈ సినిమాకి వస్తోన్న స్థాయిలో తెలుగు రాష్ట్రాలలో కూడా కలెక్షన్స్ వచ్చి ఉంటే కచ్చితంగా 'ఆర్ఆర్ఆర్' మూవీ షేర్ రికార్డ్ ని ఈ సినిమా దాటిపోయేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కలెక్షన్స్ లెక్కలు చూస్తుంటే లాంగ్ రన్ లో 'బాహుబలి 2' షేర్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
మరో ఏడు కోట్ల షేర్ అందుకుంటే 'పుష్ప 2' మూవీ 'బాహుబలి 2' లాంగ్ రన్ తెలుగు రాష్ట్రాల షేర్ ని దాటేస్తుంది. ప్రస్తుతం సినిమాకి వస్తోన్న ఆదరణ చూస్తుంటే కచ్చితంగా టాప్ 2 హైయెస్ట్ షేర్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. లాంగ్ రన్ లో ఈ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.