కల్కి లెక్కను దాటేలా పుష్పరాజ్ హవా

ఇండియాలోనే కాకుండా నార్త్ అమెరికాలో కూడా పుష్ప 2 అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అది కలెక్షన్స్ లలో స్పష్టంగా కనిపిస్తోంది.

Update: 2024-12-08 14:30 GMT

ఇండియాలోనే కాకుండా నార్త్ అమెరికాలో కూడా పుష్ప 2 అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అది కలెక్షన్స్ లలో స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే మేకర్స్ లెక్కల ప్రకారం 449 కోట్ల కలెక్షన్స్ ని ‘పుష్ప 2’ అందుకుంది. ఇక ఈ వసూళ్లు మూడో రోజుకి 550 కోట్లు క్రాస్ అయ్యాయని తెలుస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి ఇండియన్ మూవీగా ఇది నిలిచింది.

ఇదే జోరు కొనసాగితే మొదటివారంలోనే 1000 కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరిపోయే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇక నార్త్ అమెరికాలో కూడా ‘పుష్ప 2’కి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే 8 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. అల్లు అర్జున్ కెరియర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ ఈ చిత్రంతో అందుకోబోతున్నాడని ఈ స్పీడ్ చూస్తుంటే చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ మూవీ 8 మిలియన్ క్లబ్ లో చేరడం ద్వారా మరో ఫీట్ ని సాధించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర 1’ మూవీకి నార్త్ అమెరికాలో 6 మిలియన్ డాలర్స్ ని లాంగ్ రన్ లో వసూళ్లు చేసింది. ‘పుష్ప 2’ కేవలం మూడు రోజుల్లోనే ‘దేవర’ ఆల్ టైం కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. ఈ ఏడాది నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా ‘కల్కి 2898ఏడీ’ ఉంది.

ఈ మూవీ 18.57 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకుంది. ‘పుష్ప 2’ ఈ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి అన్ని చోట్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అతనిని అభిమానించని వారు కూడా సినిమాలోని పెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోతున్నారు. పుష్ప 1 కి మించిన యాక్టింగ్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ చేసాడని అంటున్నారు.

ఈ సినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ కచ్చితంగా అల్లు అర్జున్ కి ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఈ సినిమాతో ఆయనకి కూడా ప్రభాస్ రేంజ్ మార్కెట్ క్రియేట్ కావడం ఖాయం అని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Tags:    

Similar News