అడవిలో పుష్ప రాజ్ రొమాంటిక్ డోస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా ‘పుష్ప 2: ది రూల్’.

Update: 2024-08-12 09:15 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, తాజా షెడ్యూల్ ముగింపు సందర్భంగా ఒక ప్రత్యేకమైన రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఈ సాంగ్ లో అల్లు అర్జున్ రష్మిక మందన్న మధ్య రొమాంటిక్ సీన్స్ ఉంటాయని, అవి ప్రేక్షకుల మనసులను కట్టిపడేస్తాయని చెబుతున్నారు. సాంగ్ ను చిత్రీకరించడానికి మేకర్స్ అడవి నేపథ్యంలో ఒక భారీ సెట్ ను నిర్మించనున్నట్లు తెలిసింది. ఈ సెట్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయబోతున్నట్లు టాక్.

‘పుష్ప: ది రైజ్’ తరువాత ప్రేక్షకులు ‘పుష్ప 2’ పై మరింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం సాధించిన సూపర్ హిట్ తరువాత, ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకుని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పార్ట్ 2ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన పాటలు గట్టిగానే ట్రెండ్ అయ్యాయి.

అల్లు అర్జున్ మరియు రష్మిక రొమాన్స్ తో కూడిన ఈ కొత్త సాంగ్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ భావిస్తోంది. సెట్ నిర్మాణం పూర్తి కాగానే, ఈ పాటను షూట్ చేసి ప్రేక్షకులకు మరింత ఉత్కంఠభరితమైన అనుభూతిని కలిగించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ‘పుష్ప 2: ది రూల్’ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాను మొదట ఆగస్టులోనే విడుదల చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. కానీ సినిమా షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం పూర్తి కాకపోవడంతో మళ్ళీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇక అందుకు తగ్గట్టుగా దర్శకుడు ప్రత్యేకమైన ప్రణాళికలు కూడా రచిస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప పార్ట్ 1 సమయంలో ప్రమోషన్స్ విషయంలో కాస్త సమయం దొరకలేదు కానీ ఈసారి ప్రమోషన్స్ కోసం కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలని అనుకుంటున్నారు. అందుకే సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News