పుష్ప 2.. వేగంతో ఆట!

ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతిలో సినిమా షూటింగ్ కొనసాగిస్తే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందుకే సుకుమార్ ఒక ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది.

Update: 2024-02-03 15:39 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై ఆశలు గట్టిగానే పెట్టుకున్నాడు. అందుకే టైమ్ ను లెక్క చేయకుండా సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్క్ అందుకోవాలి అని కసితోనే కనిపిస్తూ ఉన్నాడు. మరోవైపు సుకుమార్ కూడా పర్ఫెక్షన్ కోసం ఏమాత్రం తగ్గకుండా హార్డ్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా అనుకున్న సమయానికి అసలు విడుదల అవుతుందా లేదా అని అనుమానాలు కూడా ఇటీవల చాలానే వచ్చాయి. ఎందుకంటే సుకుమార్ పర్ఫెక్షన్ కోసం చాలా ఎక్కువ సమయం అయితే తీసుకుంటాడు. అతని కెరీర్ లో మొదట చెప్పిన డేట్ కు సినిమాను రిలీజ్ చేసిన సందర్భాలు అయితే చాలా తక్కువ. ఇక పుష్ప 2 ఆగస్టు 15 డేట్ కి రావడం డౌటే అనే విధంగా గాసిప్స్ అయితే గట్టిగానే వచ్చాయి.

కానీ చిత్ర యూనిట్ ఇటీవల అనుకున్న సమయానికి వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా చాలా బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పద్ధతిలో సినిమా షూటింగ్ కొనసాగిస్తే ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందుకే సుకుమార్ ఒక ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది.

ఇటీవల జాతర ఎపిసోడ్ కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చిందట. ఇక నెక్స్ట్ షెడ్యూల్స్ కు మాత్రం ఆలస్యం కాకుండా మూడు ప్రత్యేకమైన టీములతో సినిమా షూటింగ్ చేంజ్ ఇంకాస్త వేగంగా ఫినిష్ చేసేలా ప్లాన్ వేసినట్లు సమాచారం. ఇంతకుముందు సెట్స్ లో ఉన్న జనాభా కంటే ఇప్పుడు ఎక్కువ స్థాయిలో టీం సభ్యులు పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది.

సుకుమార్ సెట్స్ లోకి అడుగుపెట్టకముందే షూటింగ్ కి కావాల్సిన అన్ని అవసరాలను రెడీ చేసేలా మైత్రి సిద్ధం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఏదైనా కావాలి అంటే అప్పటికప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ సాలీడ్ టీమ్ తో సిద్ధంగా ఉంటుందట. ఖర్చు విషయంలో కూడా నిర్మాతలు వెనుకడుగు వేయడం లేదు. ఆగస్టు 15 పర్ఫెక్ట్ డేట్ కావడంతో షూటింగ్ చాలా వేగంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రమోషన్స్ కోసం కూడా ప్రత్యేకంగా ప్రణాళికలు రచిస్తున్నారు. మరి ఈ వేగంతో పుష్ప అనుకున్న డేట్ కు అవుట్ ఫుట్ అందిస్తుందో లేదో చూడాలి.


Tags:    

Similar News