'పుష్ప 3'.. అంత తొందరెందుకు మాస్టారూ?

అయితే మేకర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డేట్ ను మిస్ అయ్యే సమస్యే లేదంటూ జెట్ స్పీడ్ తో షూటింగ్ చేసేస్తున్నారు. డెడ్ లైన్ పెట్టుకొని రాత్రింబవళ్ళు పని చేస్తున్నారు.

Update: 2024-03-04 12:21 GMT

2024 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో 'పుష్ప: ది రూల్' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ పార్ట్ 'పుష్ప: ది రైజ్' ఊహించని విధంగా నార్త్ ఇండియాలో బ్లాక్ బస్టర్ అవ్వడంతో, ఇప్పుడు అందరూ 'పుష్ప 2' కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. అయితే ఈ మూవీ ఇంకా థియేటర్లలోకి రాకముందే, 'పుష్ప' పార్ట్-3 కి సంబంధించిన రూమర్ చక్కర్లు కొడుతున్నాయి.

'పుష్ప 2' చిత్రాన్ని 2024 ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి ఈ సినిమా రాకపోవచ్చనే ఆ మధ్య వైరల్ అయ్యాయి. అయితే మేకర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డేట్ ను మిస్ అయ్యే సమస్యే లేదంటూ జెట్ స్పీడ్ తో షూటింగ్ చేసేస్తున్నారు. డెడ్ లైన్ పెట్టుకొని రాత్రింబవళ్ళు పని చేస్తున్నారు. వీలయినంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ మీద ఫోకస్ పెట్టాలని సుక్కు అండ్ టీమ్ కష్టపడుతోంది. అయితే పుష్ప: ది రూల్' షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని, ఇప్పుడు 'పుష్ప 3'లో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారని ఓ పుకారు పుట్టుకొచ్చింది.

'పుష్ప: ది రూల్' సినిమా కంటెంట్, రషెస్ చూసి 'పుష్ప 3' అవసరమని సుకుమార్ - బన్నీలు భావించారని.. అందుకే మూడో భాగానికి సంబంధించి ఇటీవల కొంత భాగం చిత్రీకరణ జరిగిందని అంటున్నారు. ప్లాన్ ప్రకారం ఆగస్ట్ లో 'పుష్ప 2' రిలీజ్ చేసి, ఈ ఇయర్ ఎండింగ్ కు పార్ట్ 3 పెండింగ్ షూట్ పూర్తి చేస్తారని.. అంతేకాదు 2025 సమ్మర్ లో 'పుష్ప 3' చిత్రాన్ని విడుదల కూడా చేస్తారనే రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే సుకుమార్ వర్కింగ్ స్టైల్, పాన్ ఇండియా సినిమాల మేకింగ్ చూసుకుంటే.. వీటిల్లో నిజం లేకపోవచ్చనే అనిపిస్తోంది.

నిజానికి 'పుష్ప' పార్ట్-1 రిలీజైన వెంటనే 'పుష్ప 2' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తానని మైత్రీ మూవీ మేకర్స్ చెప్పారు. అయితే మొదటి భాగానికి నార్త్ లో అనూహ్య స్పందన లభించిన తర్వాత అన్ని లెక్కలు మారిపోయాయి. రెండో భాగాన్ని అత్యధిక బడ్జెట్ తో, భారీ స్థాయిలో తెరకెక్కించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. సుకుమార్ సైతం స్క్రిప్ట్ కోసం, ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకున్నారు. అందుకే 'పుష్ప: ది రూల్' 2021 డిసెంబర్ లో రిలీజైతే, పార్ట్ 2 రావడానికి రెండున్నరేళ్లకు పైగా సమయం పడుతోంది.

'పుష్ప 1'తో పోల్చి చూస్తే 'పుష్ప 2' చాలా పెద్ద కాన్వాస్‌లో ఉండబోతోందని, క్యారెక్టరైజేషన్ పరంగా సెకండ్ పార్ట్ లో హయ్యెస్ట్ ఎండ్ ను చూస్తారని ఇటీవల అల్లు అర్జున్ తెలిపారు. అంతేకాదు ఖచ్చితంగా పుష్ప పార్ట్-3 ని ఆశించవచ్చని.. దీన్ని ఒక ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నామని.. దీని కోసం అద్భుతమైన ఐడియాలు ఉన్నాయని చెప్పారు. ఇదంతా చూస్తుంటే 'పుష్ప: ది రూల్' ఫలితాన్ని బట్టి ఈ ఫ్రాంచైజీలో సినిమాలు ఉండే అవకాశాలు ఉన్నాయనేది అర్థమవుతుంది.

ప్రస్తుతానికి 'పుష్ప 2' సినిమా చుట్టూ నెలకొన్న బజ్ ని బట్టి చూస్తే, బాక్సాఫీస్ వద్ద 'KGF 2' రికార్డ్స్ బ్రేక్ అవ్వడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే కనుక జరిగితే దీనికి కొనసాగింపుగా రాబోయే సినిమాలు ఇంకా భారీ స్కేల్ లో ఉంటాయనడంలో సందేహం లేదు. బడ్జెట్ కూడా అప్పటి మార్కెట్ కు తగ్గట్లుగా, బన్నీ క్రేజ్ కు తగ్గట్లుగా ఉంటుంది. అదే గ్లోబల్ లెవల్ లో రీచ్ వస్తే, ఇంటర్నేషల్ యాక్టర్స్ యాడ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ 'పుష్ప 2' అంచనాలు అందుకోలేకపోతే, దానికి తగ్గట్టుగా పార్ట్-3 ఉండే అవకాశం వుంది.

మొత్తం మీద 'పుష్ప: ది రూల్' ఏ రేంజ్ లో హిట్ అయితే, ఆ రేంజ్ లో లేదా అంతకంటే హై రేంజ్ లో 'పుష్ప 3' ఉండేలా అల్లు అర్జున్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకానీ పార్ట్-2 రీచ్ ఎలా ఉంటుందో చూడకుండానే.. మూడో భాగం షూటింగ్ చేసేయడం, రిలీజ్ డేట్ కూడా అనుకోవడం లాంటివి సుకుమార్ చేస్తాడని అనుకోలేం. కాబట్టి 'పుష్ప 3' చిత్రీకరణ ఈ ఏడాది చివరకు పూర్తవుతుందని వస్తోన్న వార్తలు ఒట్టి రూమర్స్ అని తెలుస్తోంది. కాకపోతే క్లైమాక్స్ లో పార్ట్-3 కి లీడ్ ఇవ్వొచ్చు. ఏదేమైనా 'పుష్ప 2' రిజల్ట్ చూసిన తర్వాతే 'పుష్ప 3' గురించి సుక్కు అండ్ బన్నీ ఆలోచించే అవకాశం ఉంది.

Tags:    

Similar News