ఆ టైంలో గుండె రాయి చేసుకున్నా..!
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశి ఖన్నా అప్పటి నుంచి తన మార్క్ నటనతో ఆకట్టుకుంటూ వస్తుంది.
ప్రేమ ఓ అద్భుతమైన అనుభూతి అయితే ఈ ప్రేమలో పడి విజయాన్ని సాధించిన వారు కొందరైతే ప్రేమ వల్ల ప్రేమించిన వారి వల్ల విరహ వేదన పొందిన వారు కొందరు. ఏ ఏజ్ లో వారైనా ప్రేమానుభూతి పొంది అది దక్కక పోతే వచ్చే బాధని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఐతే తనకు అలాంటి ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉందని చెబుతుంది అందాల భామ కథానాయిక రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశి ఖన్నా అప్పటి నుంచి తన మార్క్ నటనతో ఆకట్టుకుంటూ వస్తుంది.
తెలుగులో స్టార్ రేంజ్ కి వెళ్లలేకపోయింది కానీ ఒక మోస్తారు ఇమేజ్ తో నెట్టుకొస్తుంది. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో కూడా రాశి ఖన్నా రాణిస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు ది సబర్మతీ రిపోర్ట్ సినిమాలో నటించింది. విక్రాంత్ మస్సే లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాను రంజన్ చందేల్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో రాశి ఖన్నా తన కెరీర్ ఇంకా పర్సనల్ లైఫ్ విషయాలను షేర్ చేసుకుంది.
సౌత్ లో ఎన్నో సినిమాలు చేశా నటిగా తన అసలు ప్రయాణం మొదలైంది అక్కడే.. ఊహలు గుసగుసలాడే తర్వాత తిరుపతి వెళ్తే తనని అక్కడ జనాలు గుర్తించి తన చుట్టూ మూగారు. ఆ టైం లో తనకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదని మేనేజర్ చెప్పాక కానీ వాళ్లంతా తన కోసమే వచ్చారని అర్థం కాలేదని అన్నది రాశి ఖన్నా. అంతేకాదు పర్సనల్ గా తాను ఎమోషనల్ పర్సన్ అని. ఒకసారి ప్రేమలో కూడా ఫెయిల్ అయ్యానని అన్నది రాశి ఖన్నా.
ఆ టైం లో తను చాలా బాధపడ్డానని మానసికంగా కుంగిపోయా ఆ తర్వాత తనను తానే మార్చుకుని స్ట్రాంగ్ గా మారానని చెప్పింది రాశి ఖన్నా. సెలబ్రిటీస్ అయినంత మాత్రాన వారికి లవ్ స్టోరీస్ ఉండవని కాదు. ప్రేమ ఎవరికైనా ఒకటే కదా.. బాధ కూడా ఒకటే. ఐతే కెరీర్ మీద దృష్టి పెట్టి తన ఫెయిల్యూర్ లవ్ ని మర్చిపోయానని చెప్పింది రాశి ఖన్నా. సినిమాల పరంగా సక్సెస్ రేటు ఎక్కువ లేకపోయినా రాశి ఖన్నా సౌత్ ఆడియన్స్ ని తన యాక్టింగ్ తో పాటు గ్లామర్ తో కూడా అలరిస్తుంది. ఐతే కెరీర్ ని స్ట్రాంగ్ చేసే మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్న అమ్మడికి అలాంటి ఛాన్స్ లు రావట్లేదని చెప్పొచ్చు.