పాపులారిటీ ఇక్కడ.. అవకాశాలు అక్కడ..!
ఇందులో స్టార్ ఛాన్స్ వచ్చినా కాలం కలిసి రాక వాటి ద్వారా పొందాల్సిన గుర్తింపు.. తెచ్చుకోవాల్సిన క్రేజ్ సంపాదించలేదు.
తొలి సినిమాతోనే కథానాయికగా క్రేజ్ తెచ్చుకుని స్టార్ గా ఎదిగిన వారు కొందరైతే.. తమకు వచ్చిన ఛాన్స్ లను వాడుకుంటూ నటిగా తమని తాము షైన్ చేసుకుని ప్రేక్షకుల హృదయాలను గెలవడం మరి కొందరు హీరోయిన్స్ చేస్తున్న పని. ఐతే చేస్తున్న సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నా వాటిని అవకాశాలుగా మార్చుకోలేని హీరోయిన్స్ కేటగిరి కూడా ఒకటి ఉంటుంది. ఇందులో స్టార్ ఛాన్స్ వచ్చినా కాలం కలిసి రాక వాటి ద్వారా పొందాల్సిన గుర్తింపు.. తెచ్చుకోవాల్సిన క్రేజ్ సంపాదించలేదు. ఈ లిస్ట్ చాలా పెద్దదే అయినా వారిలో టాప్ ప్లేస్ లో ఉంటుంది రాశి ఖన్నా.
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత యువ హీరోలతో నటిస్తూ పాపులారిటీ తెచ్చుకుంది. తనకు వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా చేస్తూ వచ్చిన రాశి ఖన్నా సినిమాలైతే చేస్తున్నా ఎందుకో స్టార్ రేంజ్ కి వెళ్లలేకపోయింది. బహుశా తను ఎంపిక చేసుకున్న కథల వల్లనో లేక తను జత కట్టిన కథానాయకుల వల్లనో రాశి సగటు హీరోయిన్ గా ఒక మోస్తారు ఇమేజ్ ని మాత్రమే సంపాదించింది.
ఎన్ టీ ఆర్ లాంటి స్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నా కూడా రాశికి లక్ కలిసి రాలేదంటే అమ్మడు ఎంత అన్ లక్కీనో అర్థం చేసుకోవచ్చు. ఐతే సౌత్ లో అరకొర అవకాశాలతో సరిపెట్టుకుంటున్న రాశి ఖన్నా బాలీవుడ్ లో వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. ఈమధ్యనే రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది రాశి ఖన్నా. తెలుగులో నాగ చైతన్యతో థాంక్యూ తర్వాత ఇక్కడ ఛాన్స్ లు అందుకోలేని రాశి ఖన్నా హిందీలో మాత్రం యోదా, సబర్మతీ రిపోర్ట్ సినిమాల్లో నటించింది.
యోధా సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు కానీ సబర్మతీ రిపోర్ట్ మాత్రం పర్వాలేదు అన్నట్టుగా టాక్ తెచ్చుకుంది. ఐతే ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్ ఆడియన్స్ ని బుట్టలో వేసుకునేందుకు ఇక్కడ ప్రేక్షకుల ప్రేమ గురించి చెప్పుకొస్తోంది రాశి ఖన్నా. ఇదంతా ఇక్కడ ఆడియన్స్ ని తన బుట్టలో వేసుకునే ప్లాన్ అని కొందరు అంటున్నా సౌత్ ఆడియన్స్ కు సినిమా పట్ల ఉన్న అభిమానాన్ని గౌరవిస్తూ రాశి ఖన్నా ఇలా మాట్లాడుతుందని కొందరు అర్థం చేసుకున్నారు.
మరి మళ్లీ సౌత్ లో ఛాన్స్ వస్తే మాత్రం ఈసారి ఎలాగినా ఇక్కడ తిష్ట వేసేలా చూడాలని అనుకుంటుంది రాశి ఖన్నా. మరి ఆ అవకాశం ఎవరిస్తారన్నది చూడాలి.