70 దేశాల్ని వెనక్కి నెట్టి తొలి మిస్ గ్రాండ్ కిరటీం !
దేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్ నమోదైంది. మిస్ గ్రాండ్ టైటిల్ గెలుచుకుని తొలిసారి ఓ చరిత్ర నమోదు చేసింది.
దేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్ నమోదైంది. మిస్ గ్రాండ్ టైటిల్ గెలుచుకుని తొలిసారి ఓ చరిత్ర నమోదు చేసింది. ఇంతకీ ఏంటా? చరిత్ర అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రేచల్ గుప్తా ప్రతిష్ఠాత్మక ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ కిరీటాన్ని అందుకున్నారు. బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్నారు. వారందరినీ వెనక్కి నెట్టి రేచల్ ఈ టైటిల్ సాధించారు. ఈ విజయంతో రేచల్ ‘గ్రాండ్ పీజెంట్ చాయిస్’ అవార్డును కూడా గెలుచుకుని మిస్ యూనివర్స్ 2000 లారా దత్తా సరసన చేరారు.
ఈ విజయాన్ని రేచల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్‌ను గెలుచుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న రేచల్ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలకు అర్హత సాధించారు.
రేచల్ 2022లో ‘మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ద వరల్డ్’ టైటిల్ కూడా సాధించారు. ఇన్‌స్టాలో ఆమెకు మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 విజేతగా నిలిచిన ఆమె గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రపంచ శాంతి, స్థిరత్వంపై ప్రచారం కల్పిస్తారు. ఇప్పటివరకూ మిస్ గ్రాండ్ పోటీలకు చాలా మంది భామలు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించారు కానీ టైటిల్ గెలవలేదు.
ప్రతీ ఏడాది కాంపిటీషన్ లో ఉంటున్నారు తప్ప? పైనల్స్ వరకూ కూడా వెళ్లడం లేదు. ఈసారి మాత్రం ఏకంగా టైటిల్ తోనే పంజాబీ బ్యూటీ చరిత్ర సృష్టించింది. ఇక ఇదే పోటీ ఇటీవలే నెట్టింట వైరల్ అయిన పాకిస్తాన్ బ్యూటీ రోమా అనే మోడల్ వైరల్ అయింది. ఈ పోటీల్లో ఆమె కూడా పైనల్స్ లో పాల్గొంది . ఇలా అందర్నీ పక్కకు నెట్ట పంజాబీ మోడల్ చరిత్ర రాసింది.