2025లో భారీగానే ప్లాన్ చేసిన న‌యా స్టార్!

భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా తెలుగు ఆడియ‌న్స్ ని అంత‌గా ఎంగేజ్ చేయ‌లేదు.

Update: 2024-12-18 06:08 GMT

రాఘ‌వ‌లారెన్స్ తెర‌పైకి తెచ్చిన ముని ( కాంచ‌న‌) హార‌ర్ ప్రాంచైజీ ప్రాంచైజీ ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. 'ముని' నుంచి మొద‌లై కాంచ‌న‌గా మారి త‌మిళ్, తెలుగులో మంచి విజ‌యం సాధించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ ప్రాంచైజీ నుంచి మూడు భాగాలు రిలీజ్ అయ్యాయి. అందులో 'కాంచ‌న‌-3' డివైడ్ టాక్ తో బ‌య‌ట ప‌టింది. అనుకున్న స్థాయిలో థ‌ర్డ్ పార్ట్ రీచ్ అవ్వ‌లేదు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా తెలుగు ఆడియ‌న్స్ ని అంత‌గా ఎంగేజ్ చేయ‌లేదు. అయినా 'ముని' బ్రాండ్ ఇమేజ్ ఎక్క‌డా దెబ్బ తిన‌లేదు.

ఆ ప్రాంచైజీ నుంచి మ‌రిన్ని హార‌ర్ యాక్ష‌న్ చిత్రాలు ప్రేక్ష‌కులు కోరుకుంటున్నారు. 'కాంచ‌న‌-4' ఎప్పుడంటూ అభిమానులు నెట్టింట చాలా కాలంగా అడుగుతున్నారు. తాజాగా అందుకు స‌మ‌యం అస‌న్న‌మైంది. లారెన్స్ కాంచ‌న అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. 'కాంచ‌న‌-4'ని సంక్రాంతి త‌ర్వాత షూటింగ్ మొద‌లు పెడుతున్న‌ట్లు తెలిపారు. రాఘ‌వ లారెన్స్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో కాంచ‌న ప్రాంచైజీ తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. నాల్గ‌వ భాగానికి కూడా ఆయ‌నే బాధ్య‌త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో హీరోయిన్ ఎవ‌రు? ఇత‌ర న‌టీన‌టులు? సాంకేతిక నిపుణుల వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా ట్రెండ్ న‌డుస్తోన్న నేప‌థ్యంలో 'కాంచ‌న‌-4'ని ఆ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడా? లేక తెలుగు, త‌మిళ్ కే ప‌రిమితం చేస్తారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం లారెన్స్ 'అధిగారం' అనే త‌మిళ సినిమా లో న‌టి స్తున్నాడు. సినిమా సెట్స్ లో ఉంది. వ‌చ్చే ఏడాది షూటింగ్ పూర్తిచేసుకుని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకున్నారు. అలాగే 'బెంజ్' అనే మ‌రో సినిమా కూడా సెట్స్ లో ఉంది.

ఈ మ‌ధ్య‌లోనే 'కాంచ‌న‌-4' ని ప‌ట్టాలెక్కించాల‌ని లారెన్స్ స‌న్నాహాలు చేస్తున్నాడు. అయితే 2024లో లారెన్స్ సినిమా లేవి చేయ‌లేదు. అంత‌కు ముందు ఏడాది మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా? 2024లో మాత్రం నో మూవీస్ అని రిలాక్స్ లో ఉన్నాడు. 2025 లో మాత్రం మూడు సినిమాలు రిలీజ్ చేయ‌నున్నాడు.

Tags:    

Similar News