SSMB29: మొదటి షెడ్యూల్ ఎక్కడంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘SSMB29’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ‘SSMB29’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీగా ఈ చిత్రాన్నీ రాజమౌళి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు. వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా ఈ సినిమాలో మహేష్ బాబు కనిపిస్తాడని తెలుస్తోంది. ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమా మెజారిటీ కథ అంతా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందంట. అడ్వాంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా మూవీ కథాంశం ఉండబోతోందని టాక్ నడుస్తోంది. ఇక సినిమాలో ఇండియన్ హాలీవుడ్ యాక్టర్ ప్రియాంక చోప్రా మహేష్ బాబుకి జోడీగా కనిపించబోతోంది. ఆమె చాలా కాలం తర్వాత చేస్తోన్న ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం.
ఇదిలా ఉంటే త్వరలో క్యాస్టింగ్ గురించి అఫీషియల్ గా మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. టీమ్ అంతా కూడా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం సౌత్ ఆఫ్రికా, కెన్యా వెళ్లబోతున్నారంట. భారీ షెడ్యూల్ ని అక్కడ ప్లాన్ చేసినట్లు సమాచారం.
ముఖ్యంగా కెన్యాలో ఈ మూవీ షూటింగ్ జరగబోతోందని టాక్. ఇప్పటికే రాజమౌళి కూడా సోషల్ మీడియా ద్వారా షూటింగ్ గురించి పరోక్షంగా అప్డేట్ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ కంటే ముందుగానే హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకి సంబంధించి వర్క్ షాప్ లో కూడా పాల్గొన్నారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రియాంకా చోప్రా కూడా ఈ మూవీ కోసం ఇప్పటికే హైదరాబాద్ లో అడుగుపెట్టింది. మేకర్స్ ఈ షూటింగ్ గురించి ఇంకా అఫీషియల్ గా అప్డేట్ ఇవ్వడం ఒక్కటే మిగిలి ఉంది. త్వరలోనే దానిపై క్లారిటీ రావొచ్చని అనుకుంటున్నారు. హాలీవుడ్ మీడియా సైతం ‘SSMB29’ మూవీ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది. అయితే వారు ఎవరనేది షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత స్పష్టత రావొచ్చని అనుకుంటున్నారు. ఈచిత్రంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారని టాక్ నడుస్తోంది. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.