రాజమౌళి అతన్ని వద్దనుకోవడం.. ఇది నిజం కాదేమో?
రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్టుకు స్క్రిప్ట్ అందిస్తున్నారు.
'RRR' తో పాన్ ఇండియా సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న దర్శకరుడు ఎస్. ఎస్ రాజమౌళి తన నెక్స్ట్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి మహేష్ ప్రాజెక్టు పైనే దృష్టి సారించాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలిసింది. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్టుకు స్క్రిప్ట్ అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే తన ప్రతి సినిమాకి దాదాపు ఒకే టీం ని మెయింటైన్ చేసే రాజమౌళి మహేష్ సినిమా కోసం సినిమాటోగ్రాఫర్ ని చేంజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి తీసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ కి కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. కానీ ఈసారి మహేష్ తో చేయబోయే ప్రాజెక్టుకి అతన్ని సినిమాటోగ్రాఫర్ గా తీసుకోలేదు రాజమౌళి.
ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్ గా ఉన్న సెంథిల్ కుమార్ త్వరలోనే దర్శకుడిగా తెరంగేట్రం చేస్తున్నాడని గతంలో జోరుగా వార్తలు వినిపించాయి. నిజానికి మహేష్ బాబు సినిమాను పూర్తి చేసిన తర్వాతే సెంథిల్ కుమార్ దర్శకుడిగాఅరంగేట్రం చేయాలని రాజమౌళి భావించాడట. కానీ మహేష్ సినిమా కోసం సెంథిల్ భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో రాజమౌళి అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని కొత్త టాక్ వినిపిస్తోంది.
అయితే రాజమౌళి - సెంథిల్ బాండింగ్ ఇప్పటిది కాదు. సై నుంచి కొనసాగుతోంది. కీరవాణి తరువాత రాజమౌళి టీమ్ లో మరనిది అతనొక్కడే. ఒక విధంగా వారి మధ్యలో ఫ్యామిలీ లాంటి రిలేషన్ ఉంది. రాజమౌళి ఆ విషయాన్ని చాలాసార్లు చెప్పాడు. ఇక ఇప్పుడు రెమ్యునరేషన్ వలన సెంథిల్ తప్పుకున్నాడు అంటే అది నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. బహుశా సెంథిల్ డైరెక్టర్ గానే కంటిన్యూ అవ్వాలనే నిర్ణయం బలంగా ఉండడం కూడా వీరి బ్రేకప్ కు కారణం అయ్యి ఉండవచ్చు.
ఇక సెంథిల్ తప్పుకోవడంతో అతని స్థానంలో టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ పి.ఎస్ వినోద్ మహేష్ సినిమా కోసం ని తీసుకున్నాడు. ఇటీవల ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక సెంథిల్ కుమార్ తన డైరెక్షన్ ట్రయల్స్ లో ఉన్నాడు. అందుకే ప్రస్తుతానికి సినిమాటోగ్రఫీ నుంచి విరామం తీసుకున్నాడు. శ్రీదుర్గా ఆర్ట్స్ పై సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ ఓ హాలీవుడ్ స్టూడియోస్ తో కలిసి ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మిస్తున్నారు.
అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 1000 నుంచి 1200 కోట్ల మధ్యలో బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్స్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో మహేష్ సరసన ఇండోనేషియా బ్యూటీని రాజమౌళి సెలెక్ట్ చేసినట్లు ఇటీవలే వార్తలు వినిపించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ప్రాజెక్టు మొదలుకానుంది. ప్రస్తుతం రాజమౌళి లొకేషన్స్ వేటలో ఉన్నట్లు సమాచారం.