రాజమౌళి అప్డేట్ ఇస్తే.. త్రివిక్రమ్ పరిస్థితేంటో?
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో SSMB29వ ప్రాజెక్ట్ ను ఎప్పుడు మొదలుపెడతాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు
సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో SSMB29వ ప్రాజెక్ట్ ను ఎప్పుడు మొదలుపెడతాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా కాదు.. అంతకుమించి అనేలా ఆ సినిమా ఉండబోతుంది అని రచయిత విజయేంద్రప్రసాద్ కూడా ముందుగానే క్లారిటీ ఇచ్చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఒక అడ్వెంచర్ మూవీగా RRR కంటే హై రేంజ్ లో ఉంటుంది అని కూడా ముందుగానే వివరణ ఇచ్చారు.
దీంతో అప్పటి నుంచి కూడా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఇక రాజమౌళి అప్డేట్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి రిలీజ్ కంటే ఒకరోజు ముందు వరకు కూడా పవర్ఫుల్ అప్డేట్స్ తో హైప్ పెంచుతూ ఉంటాడు. కాస్త ఆలస్యమైనా కూడా ఆయన ఇచ్చే ప్రతి అప్డేట్ కూడా సినిమాపై అంచనాల స్థాయిని పెంచే విధంగానే ఉంటుంది.
అయితే ఈసారి ఆగస్టు 8వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా SSMB29 కి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తారా లేదా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. సాధారణంగా రాజమౌళి తన సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అయితే స్టార్స్ పుట్టినరోజున వదులుతూ ఉంటారు. ఇక మహేష్ బాబు తో సినిమా కాబట్టి ఇదే ఎడాది రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కావున తప్పకుండా ఈ పుట్టినరోజు ఏదో ఒక అప్డేట్ ఉంటుంది అని ఫ్యాన్స్ లో ఆశలు చిగురిస్తున్నాయి.
అంతా బాగానే ఉంది కానీ రాజమౌళి ఏ మాత్రం చిన్న అప్డేట్ ఇచ్చినా కూడా గుంటూరు కారం త్రివిక్రమ్ పరిస్థితి ఏమిటి అనేది కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమా చాలా ఆలస్యం అవుతోంది. మహేష్ కూడా అంత కాన్ఫిడెన్స్ తో కనిపించట్లేదు. ఏవేవో మార్పులు జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో కూడా ఫాన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీ గానే సినిమా ఉండబోతున్నట్లుగా టైటిల్ తోనే క్లారిటీ వచ్చేసింది అనే కామెంట్స్ కూడా వచ్చేశాయి. ఇక ఇప్పుడు రాజమౌళి తో మహేష్ సినిమా అంతకుమించి అనేలా ఉంటుంది కాబట్టి ఆయన అప్డేట్ వదిలితే మాత్రం గుంటూరు కారం ఆ రేంజ్ కు తగ్గట్టుగా ఇవ్వగలరా? SSMB29 ను మ్యాచ్ చేయగలరా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఏదేమైనా కూడా ఒకేరోజు రెండు సినిమాల అప్డేట్స్ వస్తే మాత్రం ఏదో ఒక స్థాయిలో మాత్రం బేధాలు చూపించకుండా ఉండరు. మరి ఎవరు ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో చూడాలి.