900 కోట్ల వ‌సూళ్ల క‌థ‌ని వ‌దిలేసిన రాజ‌మౌళి

ఆ విశేషాలు ఏంటో విజయేంద్ర ప్రసాద్ మాట‌ల్లోనే 'నేను బజరంగీ భాయిజాన్ స్క్రిప్ట్ ని రాజ‌మౌళికి చెప్పాల‌నుకున్నాప్పుడు అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Update: 2024-02-29 09:16 GMT

స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా క‌బీర్ ఖాన్ తెరెక్కించిన 'భ‌జ‌రంగ్ భాయిజాన్' సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఏడేళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా అప్ప‌ట్లోనే 900 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించి స‌ల్మాన్ కెరీర్ లో భారీ వ‌సూళ్ల చిత్రంగా రికార్డు సృష్టించింది. మ‌రి ఈ సినిమా క‌థ అందించింది తెలుగు స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. స‌రిగ్గా అదే స‌మ‌యంలో 'బాహుబ‌లి' క‌థ కూడా ఆయ‌నే అందించారు.

ఈ రెండు సినిమాలు (బాహుబ‌లి ది బిగినింగ్) ఒకే ఏడాది ఒకే నెల‌లో రిలీజ్ అయి సంచ‌ల‌నం సృష్టించా యి. మ‌ల్టీప్లెక్స్ ల్లో రెండు సినిమాల మ‌ధ్య నువ్వా? నేనా? అన్న రేంజ్ లో పోటీ క‌నిపించింది. కానీ అంతిమంగా బాహుబ‌లిలే పై చేయి అయింద‌నుకోండి. అయితే భ‌జిరంగ్ భాయిజాన్ క‌థ‌ని రాజ‌మౌళి రిజెక్ట్ చేయ‌డంతో బాలీవుడ్ కి వెళ్లింది. అవును ఈ మాట స్వ‌యంగా విజ‌యేంద్ర ప్ర‌సాద్ చెప్పారు.

సల్మాన్ ఖాన్‌కి కథ చెప్పడానికి ముందు విజయేంద్ర ప్రసాద్ రాజ‌మౌళిని సంప్రదించి కథ కావాలా? అని అడిగారుట‌. ఆ విశేషాలు ఏంటో విజయేంద్ర ప్రసాద్ మాట‌ల్లోనే 'నేను బజరంగీ భాయిజాన్ స్క్రిప్ట్ ని రాజ‌మౌళికి చెప్పాల‌నుకున్నాప్పుడు అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. క‌థ‌ని ఉంచాలా? లేదా? అని అంటే అతను మరొకరికి ఇవ్వమని చెప్పాడు. తర్వాత బజరంగీ భాయిజాన్ విడుదలైనప్పుడు రాజ‌మౌళి నా దగ్గరకు వచ్చి 'నువ్వు నన్ను తప్పు సమయంలో అడిగావు.

అప్పుడు 'బాహుబలి' క్లైమాక్స్ షూటింగ్ విషయంలో చాలా టెన్షన్ లో ఉన్నాను. కాబట్టి తొందరపడి నో చెప్పాను. మీరు నన్ను కేవలం 10 రోజుల ముందు లేదా 10 రోజుల తర్వాత అడిగి ఉంటే నేను ఆ క‌థ తీసుకునేవాడిని అన్నాడు' అని తెలిపారు. కొన్ని క‌థ‌లు కొంద‌రికే రాసి పెట్టి ఉంటాయి. అలా క‌బీర్ ఖాన్-విజ‌యేంద్ర ప్ర‌సాద్ కాంబినేష‌న్ కుదిరింది. ప్ర‌స్తుతం 'భ‌జ‌రంగ్ భాయిజాన్' సీక్వెల్ కూడా రెడీ అవు తోంది. దీనికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ య‌ధావిధిగా క‌థ అందిస్తున్నారు.

Full View
Tags:    

Similar News