సీన్ లోకి వ‌చ్చిన సూప‌ర్ స్టార్..కుమార్తెకు మ‌ద్ద‌తుగా!

కుమార్తె మాట‌ల్ని ఆయ‌న స‌మ‌ర్ధించారు. చెన్నై విమానాయ‌శ్ర‌యం సాక్షిగా ర‌జనీకాంత్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం.

Update: 2024-01-30 06:25 GMT

`మా నాన్న‌ని సంఘీ అని పిల‌వ‌డం మానేయండి. అలా పిలిస్తే త‌మ కుటుంబం ఎంత‌గా బాధ‌ప‌డుతుందో చెప్పుకొచ్చే ప్ర‌య‌త్నం చేసింది ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్. అయితే ఐశ్వ‌ర్య సంఘీ అనే ప‌దాన్ని వాడ‌టంపై పెద్ద ఎత్తున దుమారేమే లేచిన సంగ‌తి తెలిసిందే. సంఘీ అంటే చెడ్డ అర్థం వచ్చేలా మాట్లాడిందని పలువురు విమర్శించారు. వ్య‌క్తిగ‌తంగా ఐశ్వ‌ర్య టార్గెట్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో సీన్ లోకి ర‌జ‌నీకాంత్ దిగారు.

కుమార్తె మాట‌ల్ని ఆయ‌న స‌మ‌ర్ధించారు. చెన్నై విమానాయ‌శ్ర‌యం సాక్షిగా ర‌జనీకాంత్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. ఆయ‌న ఏమ‌న్నారంటే.. `నా కూతురు సంఘీ అనేది చెడ్డ పదం అని ఎప్పుడూ అన లేదు. మా నాన్నగారిని ఎందుకు బ్రాండింగ్ చేస్తున్నారు.? అని మాత్రమే అన్నది. నేను ఆధ్యాత్మిక వ్య‌క్తి అని మాత్ర‌మే చెప్పింది. నేను అన్ని మాతాల్ని ప్రేమించే వాడిగా ఆమె అంది. దీన్ని త‌ప్పుగా అర్ధం చేసుకుం టున్నార‌ని` ర‌జ‌నీకాంత్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

దీంతో ఇప్పుడీ వ్యాఖ్య‌లు నెట్టింట ఆసక్తిక‌రంగా మారాయి. సాధార‌ణంగా సూప‌ర్ స్టార్ పేరు ఎలాంటి వివాదాల్లో వినిపించ‌దు. ఏదైనా కాంట్ర‌వ‌ర్శీ వ‌చ్చినా ఆయ‌న మౌనంగా ఉంటారు. అన్నింటికి కాల‌మే స‌మాధానం చెబుతుంద‌ని భావి స్తారు. కానీ సంఘీ అనే ప‌దం విష‌యంలో మాత్రం ర‌జ‌నీకాంత్ టార్గెట్ అవ్వ‌డం అభిమానులు జీర్ణించుకోలేక‌పో తున్నారు. అన‌వ‌స‌రంగా ఆయ‌న పేరు లాగుతున్నార‌ని వాపోతున్నారు. ఆయ‌న స్వ‌భావం..వ్య‌క్తిత్వం గురించి అభిమానులు చెప్పుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అస‌లు సంఘీ అంటే ఏంటి? రైట్ వింగ్ (మితవాద) మద్దతుదారుడు లేదా కార్యకర్త గురించి చెప్పడానికి ‘సంఘీ’ అనే వ్యవ‌హారిక పదంగా ఉంది. రాజ‌కీయ నాయ‌కుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేవార‌ని అర్దం కూడా వ‌స్తుందని...ఆయ‌న సంఘీ అయితే తాను దర్శ‌కత్వం వ‌హించిన లాల స‌లామ్ చిత్రంలో న‌టించేవారు కాద‌ని ఐశ్వ‌ర్య వేడుక వ‌ద్ద వాపోయిన సంగ‌తి తెలిసిందే.




 


Tags:    

Similar News