రాజా సాబ్.. రాధే శ్యామ్.. ఏదో తేడాగా ఉందే?

ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా వేచి చూస్తున్న తరుణంలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్.

Update: 2024-01-16 03:15 GMT

మారుతి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. కనీసం సినిమాను అఫీషియల్ గా కూడా లాంచ్ చేయలేదు. కానీ అప్పుడే 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా వేచి చూస్తున్న తరుణంలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్.

మారుతీ - ప్రభాస్ కాంబినేషన్ మూవీకి 'రాజా సాబ్' అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ తో ఆకట్టుకున్నారు. పోస్టర్లో టీ షర్ట్, పూల లుంగీతో ప్రభాస్ చాలా కూల్గా, స్టైలిష్ గా కనిపిస్తున్నారు. డార్లింగ్ హెయిర్ స్టైల్ కూడా గత చిత్రాలతో పోలిస్తే చాలా కొత్తగా ఉంది. లాంగ్ హెయిర్తో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో రాజా సాబ్ టైటిల్ ఫస్ట్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

కాగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ అలా వచ్చిందో లేదో ఇంతలోనే సోషల్ మీడియాలో సరికొత్త డౌట్స్ మొదలయ్యాయి. సినిమా టైటిల్ విషయంలో పలువురు నెటిజన్స్ లేనిపోని డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ 'రాధే శ్యామ్' మూవీ టైటిల్ తో ఈ టైటిల్ ని పోలుస్తున్నారు. 'Rajasaab' టైటిల్ షార్ట్ ఫామ్ 'RS' అని వస్తుంది. అలాగే 'Radheshyam' టైటిల్ కి షార్ట్ ఫామ్ కూడా 'RS' అనే వస్తుంది.

రెండు సినిమాల షార్ట్ ఫామ్స్ సేమ్ ఉన్నాయంటే 'రాధే శ్యామ్' లాగే 'రాజా సాబ్' కూడా ప్రభాస్ కెరియర్ లో ప్లాప్ మూవీ అవుతుందా? అంటూ కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు ఫన్నీ మీమ్స్ అండ్ వీడియోస్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు ఇలాంటి లేనిపోని డౌట్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారో ఏమో.. ఫైనల్ గా కంటెంట్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది. మారుతి ని ప్రభాస్ నమ్మాడు అంటే తప్పకుండా కాన్సెప్ట్ రొటీన్ గా ఉండదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News