బ్యాక్ టూ సెట్స్...మళ్లీ బాదుడేనా?
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లో కేష్ కనగరాజ్ దర్శకత్వంలో `కూలీ` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లో కేష్ కనగరాజ్ దర్శకత్వంలో `కూలీ` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే రజనీకాంత్ కి గాయమవ్వడంతో షూటింగ్ తాత్కలికంగా వాయిదా వేసారు. శస్త్ర చికిత్స కారణంగా ఆయన కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ కి సంబంధించి సెట్స్ పనుల్లో నిమగ్నమైంది.
తాజాగా సెట్ నిర్మాణం పూర్తవ్వడంతో పాటు రజనీ కూడా కోలుకోవడంతో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టడానికి సమాయత్తం అవుతున్నారు. ఇందులో రజనీతో పాటు ప్రధాన తారాగణంపైకీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీ కరించనున్నట్లు సమాచారం. చెన్నైలో సెట్ రెడీ అవ్వడంతో లోకేష్ విషయం రజనీకి చెప్పి ఆహ్వానించగా గెట్ రెడీ అంటూ పెద్దాయన సీన్ లోకి రావడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారుట. ఈనేపథ్యంలో రేపోమాపో షూటింగ్ ప్రారంభ మవుతుందని తెలుస్తోంది.
ఇందులో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. రక్తపాతం..గన్స్ పేలుళ్లతో కూలి మొత మోగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే లోకేష్ మరో ఐదేళ్ల పాటు తన నుంచి ఈ హింసత్మాక సన్నివేశాలు ప్రేక్షకులు భరించాల్సిందేనని చెప్పేసాడు. హింస, రక్తపాతం, గన్స్ లేకుండా సినిమాలు చేయనని తేల్చిచెప్పాడు. కాబట్టి సూపర్ స్టార్ లాంటి హీరోతో అతడు ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తాడో ఊహించొచ్చు.
ఇంకా చెప్పాలంటే? అతడి యాక్షన్ ఈ సినిమాతో పీక్స్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది. సాధారణంగా రజనీ యాక్షన్ సన్నివేశాల్లో చెలరేగిపోతారు. లోకేష్ లాంటి మేకర్ దొరికాడు? అంటే ఇంకే రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇందులో కింగ్ నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగార్జున ఎంట్రీతో తెలుగు మార్కెట్ పరంగా మరింత కలిసొచ్చే అంశం. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇదే నిజమైతే ఇండియాని కూలీ షేక్ చేయడం లాంఛనమే.