అనారోగ్యం నుంచి కోలుకున్న రజినీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..

తాజాగా రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్- ద హంట‌ర్‌’చిత్రం అక్టోబర్ 10 న విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది.

Update: 2024-10-15 11:20 GMT

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఓ ఏజ్ దాటిన తర్వాత హీరోలైన హీరోయిన్లైనా కొన్ని పాత్రలకే పరిమితం అవుతారు. అయితే వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ కూడా తన స్టార్ పవర్ చూపిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న నటుడు రజినీకాంత్. పేరుకు తమిళ్ యాక్టర్ అయినా తెలుగులో కూడా ఈయనకి అభిమానులు తక్కువేమీ లేరు. ఇక తాజాగా రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్- ద హంట‌ర్‌’చిత్రం అక్టోబర్ 10 న విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది.

గ్లోబల్ గా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజులలోనే 240 కోట్లకు పైగా వసూళ్లు తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ మూవీలో రజినీ యాక్షన్ వేరే లెవెల్ లో ఉంది. టి.జె.జ్ఞాన‌వేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచి పవర్ఫుల్ గ్రిప్పింగ్ స్టోరీ.. అద్భుతమైన టేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో రజనీతోపాటు

అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహిద్ ఫాజల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుశారా విజయన్ ముఖ్య పాత్రలు పోషించారు.

తాజాగా చిత్ర బృందం రజినీకాంత్ ను కలవడానికి ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన సరికొత్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఎంతో ఫిట్గా కనిపిస్తున్న రజినీకాంత్ ను చూసి అతని అభిమానులు సంతోషించడంతోపాటు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కడుపులో నొప్పితో హాస్పిటల్ లో చేరిన రజనీకాంత్ కు హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. దీంతో డాక్టర్లు ఆయనకు చిన్నపాటి ట్రీట్మెంట్ తో పాటు స్టంట్ కూడా వేశారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఇప్పటివరకు రజనీకాంత్ కు సంబంధించిన ఎటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో రాలేదు.

ఇంతలోనే రజినీ నటించిన వేట్టయన్ చిత్రం విడుదల కావడం.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం జరిగిపోయాయి. తమ సక్సెస్ నువ్వు రజినీకాంత్ తో కలిపి సెలెబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు చిత్ర బృందం ఆయన్ను కలవడానికి ఇంటికి వెళ్లారు. ఫోటోలో ఎంతోఫిట్టుగా పూర్తిగా కోల్కున్నట్టు కనిపిస్తున్న రజినీని చూసి అభిమానులు ఆనందిస్తున్నారు.అంతేకాదు రజని త్వరలో కూలి మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News