ఆ ప్రాజెక్ట్ డిలే అవుతుందా?
అయితే లోకేష్ మాత్రం రజనీ ఉత్సాహాన్ని నిరుగారుస్తున్నట్లే కనిపిస్తుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రాన్ని (కూలీ) లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో పట్టాలెక్కించడానికి ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. లోకేష్ మార్క్ యూనివర్శ్ లో భాగమవ్వాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. జూన్ రెండవ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని భావించారు. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్ తన 170వ చిత్రం `వెట్టయాన్` ని ఎంతో వేగంగా పూర్తి చేసారు. అయితే లోకేష్ మాత్రం రజనీ ఉత్సాహాన్ని నిరుగారుస్తున్నట్లే కనిపిస్తుంది.
`కూలీ` చిత్ర షూటింగ్ మరింత ఆలస్యమవుతుందని సమాచారం. కథలో కొన్ని రకాల మార్పులు చేయాలని లోకేష్ రజనీకి చెప్పారుట. ద్వితియార్ధం కథ లో మార్పులు అవసరమని తాజాగా వెల్లడించ డంతో రజనీ అసంతృప్తికి గురైనట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గత మూడు నెలలుగా కేవలం కథపై పర్పెక్షన్ వర్క్ చేస్తున్నా? ఇంతవరకూ పూర్తి కాకపోవడం ఏంటని? రజనీ ప్రశ్నించారుట.
ఎలాగూ అప్పటికీ రజనీని కన్విన్స్ చేసినప్పటికీ ఇలా అయితే ఎలా అంటూ రజనీ సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మరో నెల రోజులైనా సమయం పడుతుందని తెలుస్తోంది అంటే అన్ని అనుకున్నట్లు జరిగితే గనుక జులై ద్వితియార్ధంలో పట్టాలెక్కుతుంది. ఒకవేళ అలా జరగలేదు అంటే మరింత ఆలస్యం తప్పదు. విక్రమ్, లియో లాంటి విజయాలు చూసి రజనీకాంత్ ..లోకేష్ ని పిలిచి మరీ అవకాశం ఇచ్చారు.
కానీ అప్పటికీ రజనీ కోసం లోకేష్ ఎలాంటి కథ సిద్దం చేయలేదు. లియో రిలీజ్ అయిన అనంతరం ఆ కథ పనుల్లోనే నిమగ్నమయ్యాడు. ఒకానొక దశలో వెట్టేయాన్ తోపాటే ఈ చిత్రాన్ని కూడా పట్టాలెక్కిస్తారని ప్రచారం సాగింది. రజనీ కాల్షీట్లు కేటాయించాలి గానీ లోకేష్ సిద్దంగా ఉన్నాడని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు రజనీ రెడీగా ఉన్నా? లోకేష్ సిద్దంగా లేకపోయే.