బిగ్ బాస్ షో వల్ల కెరీర్, జీవితం నాశనం
ఇండియన్ బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ ను ఎంతగా ఆధరిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం
ఇండియన్ బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ ను ఎంతగా ఆధరిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. హిందీ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న బిగ్ బాస్ తెలుగు లో ఏడవ సీజన్ ప్రారంభం కు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఇతర భాషల్లో కూడా బిగ్ బాస్ ప్రతి ఏడాది కొత్త సీజన్ లతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తుంది కానీ అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు ఎంతగా వారి కెరీర్ లో ఉపయోగపడుతుంది అంటూ చాలా వరకు నెగిటివ్ సమాధానం వినిపిస్తోంది. బిగ్ బాస్ షో వల్ల కెరీర్ లో సక్సెస్ అయిన వారు పది నుండి పదిహేను శాతం మంది మాత్రమే అనేది పరిశీలకుల వాదన.
షో లో పాల్గొన్న తర్వాత కెరీర్ లో దూసుకు పోయిన వారు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎక్కువ శాతం మంది అంతకు ముందు ఆ తర్వాత కూడా అలాగే ఉన్నారు. కొందరికి బిగ్ బాస్ వల్ల కెరీర్ నాశనం అయింది అనేది టాక్. తాజాగా హిందీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన రాఖీ సావంత్ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
బిగ్ బాస్ షో అనేది అందులో పాల్గొన్న వారికి పెద్ద శాపం. షో నుండి బయటకు వచ్చిన తర్వాత వారు ఏ పని చేయలేక పోతున్నారు. కెరీర్ పరంగా వారు చాలా నష్టపోతున్నారు. జీవితంలో ఓడి పోతున్నారు. అయినా కూడా వారు చాలా మంది బిగ్ బాస్ ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు అంది.
తన కెరీర్ మరియు జీవితం బిగ్ బాస్ వల్ల నాశనం అయిందని ఆమె పేర్కొంది. బిగ్ బాస్ తర్వాత ఇండస్ట్రీలో రాఖీకి ఆఫర్లు తగ్గాయట. అందుకే బిగ్ బాస్ కి వెళ్లినందుకు తాను ఎప్పటికి బాధ పడుతూనే ఉంటాను అంటూ రాఖీ సావంత్ అసహనం వ్యక్తం చేసింది.