ర‌కుల్ ప్రీత్ సింగ్ బోరున ఏడ్చేసిన రోజు అది!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టించిన `బ్రూస్ లీ` చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-15 17:30 GMT

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టించిన `బ్రూస్ లీ` చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా తొలి షోతోనే ప్లాప్ చిత్రంగా టాక్ తెచ్చుకుంది. అయితే ఈ ప్లాప్ సినిమా కోసం ఓ హిట్ సినిమాని వ‌దులుకున్న‌ట్లు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓపెన్ అయింది. `నా జీవితంలో ఓ క‌ష్ట‌త‌మైన ద‌శ ఇది. ధోనీ సినిమాకి హీరోయిన్ గా ఎంపిక‌య్యా.

దీనికి సంబంధించి స్క్రిప్ట్ రీడింగ్ ప‌నులు కూడా పూర్తి చేసా. కానీ అప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ తో బ్రూస్ లీ సినిమా చేస్తున్నా. అప్ప‌టికి ఇంకా రెండు పాట‌లు షూట్ చేయాల్సి ఉంది. దీంతో ఆ తేదీల్ని అడ్జ‌స్ట్ చేయ‌లేక ధోనీ సినిమా వ‌దులుకున్నాను. ఇంత గొప్ప సినిమా చేజారిపోతుంద‌ని అప్ప‌ట్లో ఎంతో బాధ ప‌డ్డా. ఇంట్లో కూర్చుని రోజాంతా ఏడ్చేసాను. ఆ త‌ర్వాత మంచి సినిమా వ‌దుల‌కుని త‌ప్పు చేసానా? అని నాలో నేను చాలా బాధ‌ప‌డ్డాను.

మంచి అవ‌కాశాలు అస్త‌మాను రావు. వాటిని వ‌చ్చిన‌ప్పుడు ఏదోలా చేసే ప్ర‌య‌త్నం చేయాలి. అలాంటి ప్ర‌య‌త్నం చేయ‌క‌పోవ‌డం అన్న‌ది నా త‌ప్పే` అని అంది. బాలీవుడ్ లో రిలీజ్ అయిన `ధోనీ` ది అన్ టోల్డ్ స్టోరీ ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. పాన్ ఇండియాలో ఆ సినిమా మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన గొప్ప ఎమోష‌న‌ల్ స్టోరీ చిత్ర‌మ‌ది. ఆ సినిమా త‌ర్వాత క్రికెట్ నేప‌త్యంలో మ‌రిన్ని చిత్రాలు చేసే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి.

కానీ ధోనీ క‌థ క‌నెక్ట్ అయిన‌ట్లు స‌చిన్ టెండూల్క‌ర్ బయోపిక్ కూడా క‌నెక్ట్ అవ్వ‌లేదు. అయితే అది క‌థ లోపం కాదు. ఎమోష‌న్ క్యారీ చేయ‌డంలో ద‌ర్శ‌కులు విఫ‌ల‌మ‌వ్వ‌డంతోనే చాలా బ‌యోపిక్ లు ఫెయిల్ అవుతున్నాయి.

Tags:    

Similar News