నెపోటిజంపై రకుల్ సంచలన వ్యాఖ్యలు
సౌత్‌లో అగ్ర కథానాయికగా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన సంగతి తెలిసిందే.
సౌత్‌లో అగ్ర కథానాయికగా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హిందీ సినిమాల్లో మాత్రమే అవకాశాలొస్తున్నాయి. అయితే తాను ఉత్తరాది పరిశ్రమలో బంధుప్రీతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. నెపోటిజం కారణంగా తాను సినిమా అవకాశాలను కోల్పోయానని వెల్లడించింది. ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ స్వయం కృషితో సినిమాల్లోకి రావడం తెలిసిందే. హిందీ సినీ రంగ ప్రవేశానికి ముందు దక్షిణాదిలో చాలా సినిమాలు చేసింది. రకుల్ ఇప్పటికీ రెండు పరిశ్రమలలో పనిని బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల కమల్ హాసన్ `భారతీయుడు 2 (ఇండియన్ 2)లో కనిపించింది. తదుపరి భారతీయుడు 3లోను కనిపించనుంది.
తాజాగా రణ్‌వీర్ అల్లాబాడియాతో పాడ్ కాస్ట్ లో రకుల్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను నెపోటిజం కారణంగా కొన్ని చిత్రాల్లో అవకాశాల్ని కోల్పోయాను అని తెలిపింది. కానీ నేను కూర్చుని బాధపడే వ్యక్తిని కాదు. రియాలిటీని నమ్ముతాను. బహుశా ఆ సినిమాలు నావి కాకపోవచ్చు.. కానీ ఇంకా అవకాశాలుంటాయని నమ్మాను.. అని వెల్లడించింది. చేదును పట్టించుకోకు! సైన్యంలో పని చేసిన తన తండ్రి ఉద్భోద ఇది. రకుల్ దీనిని తూ.చ తప్పక పాటిస్తుంది. నియంత్రణ కోల్పోకుండా ఇది పని చేసింది. నిజానికి నేను సైన్యంలోకి వెళ్లవలసి వచ్చింది.. ఆ సమయంలో మా నాన్న తన అనుభవాన్ని నాతో షేర్ చేసారు! అని కూడా తెలిపింది.
బంధుప్రీతి గురించి పెద్దగా ఆలోచించను. ఒక వైద్యుడు లేకపోతే మరొకరు...అలాగే ఒకరి స్థానంలో ఒక స్టార్ కిడ్‌కి సులభంగా యాక్సెస్ లభిస్తే దాని కోసం కష్టపడిన వారి తల్లిదండ్రులకు ఆ క్రెడిట్ దక్కుతుంది! అని తనదైన శైలిలో సెటైర్ వేసింది రకుల్. రకుల్ ఈ సంవత్సరంలోనే నిర్మాత కం నటుడు జాకీ భగ్నానిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ గోవాలో సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లికి వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే... రకుల్ తదుపరి `దే దే ప్యార్ దే 2`లో అజయ్ దేవగన్‌తో కలిసి కనిపించనుంది.