ఫోటో స్టోరి: రకుల్ థై షో కిల్లింగ్
మూడు ముక్కలతో డిజైన్ చేసిన బాటమ్ పీస్ రియల్టీ స్టన్నింగ్ అంటూ యూత్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
షోస్టాపర్ మీనింగ్ తెలుసా? ఇదిగో ఇక్కడ రకుల్ ని చూస్తే మీకే స్పష్ఠంగా అవగతమవుతుంది. షోస్టాపర్ గా నిలవడం ఎలానో ఆధునిక ఫిట్నెస్ ఫ్రీకుల్లో రకుల్ కి తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదేమో! ప్రతిసారీ అల్ట్రా స్టైలిష్ లుక్స్ తో కిల్ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు మరోసారి హిందూస్తాన్ టైమ్స్ షోస్టాపర్స్ జాబితాలో అగ్రపథంలో నిలిచింది.
తాజాగా షేర్ చేసిన హెచ్.టి.సిటీ షోస్టాపర్స్ ఫోటోషూట్ లో రకుల్ థై స్లిట్ ఎలివేషన్ తో ఆల్మోస్ట్ యూత్ ని కిల్ చేసిందని చెప్పాలి. మూడు ముక్కలతో డిజైన్ చేసిన బాటమ్ పీస్ రియల్టీ స్టన్నింగ్ అంటూ యూత్ ప్రశంసలు కురిపిస్తున్నారు. వైట్ కోట్ ఆభరణాలతో ఇన్నర్ లెస్ టాప్ ని ధరించిన తీరుపైనా విరుచుకుపడుతున్నారు. రకుల్ రియల్ స్టన్నర్ అంటూ కితాబిచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
ఇక హెచ్.టి ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. తనకు వెనక్కి తిరిగి చూసుకునే అలవాటు లేదని వ్యాఖ్యానించింది. తన నటనా జీవితం ప్రారంభ అనుభవంతో మొదలైంది. కెరీర్ ప్రారంభించిన ఇన్నేళ్లలో ఒక్కో అడుగు వేస్తూ కొత్త ఎత్తులకు చేరుకుంది. నా ప్రయాణం 2013లో సరిగ్గా ప్రారంభమైంది. నేను వెనక్కి తిరిగి చూసే వ్యక్తిని కాదు.. ఇంకా చాలా చేయాల్సి ఉంది. దక్షిణాది సినిమాల్లో అత్యధిక మంది స్టార్స్‌తో కలిసి పని చేస్తున్నాను.. ఆ తర్వాత హిందీలో ఈరోజు పని చేస్తున్నా.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని నేను భావిస్తున్నాను'' అని వ్యాఖ్యానించింది.
రకుల్ తాజా లుక్ కోసం సమకాలీన సాంప్రదాయ డిజైనర్ రూపంలో కనిపించింది. విధి సింఘానియా షెల్ఫ్‌ల నుంచి స్కర్ట్ ని ఎంపిక చేసుకుని.. వినూత్నంగా స్టైల్ చేసిన.. ఫుషియా, జరీ, ఘర్చోలాలో మూడు భిన్నమైన బనారసీ చీరలతో డిజైన్ చేసిన తీరు అద్భుతం. ఇక టాప్ లో బ్లేజర్‌ను ధరించింది. ఈదుస్తులను ది హైస్ ఆఫ్ ఎఫ్ఎంబిజె నుండి ఎంపిక చేయగా.. ఆభరణాలతో డిజైనర్ లుక్ వ్వావ్ అనిపిస్తోంది. రకుల్ నటించిన మోస్ట్ అవైటెడ్ భారతీయుడు 2 త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్, సిద్ధార్థ్ సహా పాపులర్ తారాగణం ఇందులో నటించగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.