గేమ్ చేంజర్ పై లైకా ఆశలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పనులు మొత్తానికి చివరి దశకు చేరుకున్నాయి.

Update: 2024-10-04 10:30 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పనులు మొత్తానికి చివరి దశకు చేరుకున్నాయి. ఇక ఈ సినిమాపై మేకర్స్ అయితే చాలా నమ్మకంగా ఉన్నారు. కానీ ఫ్యాన్స్ లో మాత్రం మూవీపై ఏదో ఒక మూల టెన్షన్ ఉందని చెప్పొచ్చు. దీంతో మెగా ఫ్యాన్స్ డౌట్స్ క్లియర్ చేసి సినిమాని సాలిడ్ గా మార్కెట్ లోకి పంపించి హైప్ తీసుకొచ్చే పనిని ఇప్పటికే దిల్ రాజు మొదలుపెట్టారు.

గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దసరా ఫెస్టివల్ కానుకగా గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. అలాగే మిగిలిన సాంగ్స్ కూడా బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో దిల్ రాజుతో పాటు మూవీ టీం అందరూ వర్క్ చేస్తున్నారు. డిసెంబర్ 20న రిలీజ్ కాబోయే ఈ సినిమాపై చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. దిల్ రాజు బ్యానర్ లో రాబోతున్న అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇదే. ఆల్ మోస్ట్ 200 కోట్లకి పైగా బడ్జెట్ ఈ చిత్రంపై పెట్టారు.

దీంతో దిల్ రాజు స్ట్రాంగ్ గా పాన్ ఇండియా రేంజ్ లో నిలబడాలంటే ‘గేమ్ చేంజర్’ సక్సెస్ చాలా అవసరం. ఇక డైరెక్టర్ శంకర్ కూడా ఈ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. ‘రోబో’ తర్వాత శంకర్ ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ అందుకోలేదు. రీసెంట్ గా వచ్చిన ‘ఇండియన్ 2’ మూవీ అన్నిటికంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఈ మూవీ కారణంగా శంకర్ మేకింగ్ స్టైల్ మీద పబ్లిక్ కి అనుమానాలు మొదలయ్యాయి. అందుకే ‘గేమ్ చేంజర్’ తో ప్రూవ్ చేసుకొని శంకర్ తిరిగి ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నారు.

ఇక రామ్ చరణ్ మార్కెట్ స్టామినా ఏంటనేది తెలియాలంటే కచ్చితంగా ఈ మూవీతో సూపర్ సక్సెస్ అందుకోవాల్సిందే. పాన్ ఇండియా రేంజ్ లో రామ్ చరణ్ సోలోగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ‘గేమ్ చేంజర్’ మంచి అవకాశం. ఇవన్నీ ఇలా ఉంటే కోలీవుడ్ బడా నిర్మాణ సంస్ధ లైకా ప్రొడక్షన్స్ ఐయితే ‘గేమ్ చేంజర్’ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాని లైకా ప్రొడక్షన్ లోనే చేశారు. మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఫైనాన్సియల్ గా బాగా లాస్ అయ్యారు.

‘ఇండియన్ 2’ కి కొనసాగింపుగా ‘ఇండియన్ 3’ కూడా ఉంది. ఆ సినిమాకి ప్రేక్షకాదరణ పెరగాలంటే ‘గేమ్ చేంజర్’ తో శంకర్ పెద్ద సక్సెస్ కొట్టాలి. అప్పుడు కొంత నెగిటివిటీ తగ్గుతుంది. అది ‘ఇండియన్ 3’ సినిమాకి ఎంతో కొంత మార్కెట్ క్రియేట్ చేస్తుంది. ఒక వేళ ‘గేమ్ చేంజర్’ ఫలితం ఆశించిన స్థాయిలో లేకుంటే ‘ఇండియన్ 3’ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Tags:    

Similar News