ఏఐ - డేటా ఎన‌లటిక్స్ పై సంగీత ద‌ర్శ‌కుడు ఉద్యోగం!

ర‌మ‌ణ గోకుల మ్యూజిక్ సెన్షేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సంగీత దర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు.

Update: 2024-12-18 21:30 GMT

ర‌మ‌ణ గోకుల మ్యూజిక్ సెన్షేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సంగీత దర్శ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు. ఎన్నో హిట్ సినిమాల‌కు సంగీతం అందించారు. ముఖ్యంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌కు ర‌మ‌ణ గోకుల అంటే ఓ బ్రాండ్ అప్ప‌ట్లో. డిఫ‌రెంట్ ట్యూన్స్ స‌హా త‌న‌దైన మార్క్ హ‌స్కీ వాయిస్ తో శ్రోత‌ల్ని అల‌రించ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ప్రేమంటే ఇదేరా..త‌మ్ముడు, బ‌ద్రీ, యువ‌రాజు, జానీ, అన్న‌వ‌రం ఇలా ఎన్నో సినిమాల‌కు సంగీతం అందించారు.

అయితే 2013లో `1000 అబ‌ద్దాలు` సినిమా త‌ర్వాత ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యారు. అప్ప‌టికే ఇండ‌స్ట్రీలో కొత్త త‌రం సంగీత దర్శ‌కులు స‌క్సెస్ పుల్గా దూసుకుపోతున్నారు. థ‌మ‌న్, దేవి శ్రీ ప్ర‌సాద్ ల హ‌వా న‌డుస్తుంది. అప్ప‌టి నుంచి ర‌మ‌ణ గోకుల ఏ సినిమాకి సంగీతం అందించ‌లేదు. దీంతో ఆయ‌న‌కు అవ‌కాశాలు రాక సినిమాలు చేయ‌లేదా? లేక ఆస‌క్తి లేక చేయ‌లేదా? అన్న సందేహం ఉంది.

చాలా గ్యాప్ త‌ర్వాత వెంక‌టేష్ హీరోగా న‌టిస్తోన్న `సంక్రాంతి వ‌స్తున్నాం` లో `గోదారి గ‌ట్టు` పాట పాడి ఒక్క‌సారిగా మ‌ళ్లీ వెలుగులోకి వ‌చ్చారు. ఈ సినిమా రిలీజ్ నేప‌థ్యంలో గ్యాప్ కి గ‌ల కొన్ని కార‌ణాలు రివీల్ చేసారు. `వ్య‌క్తిగ‌త జీవితం అమెరికాలో గడుపుతున్నా. నాకు సాంకేతిక‌త అంటే ఇష్టం. ఏఐ, డేటా ఎన‌ల‌టిక్స్ ప్రాజెక్ట్ పై విదేశాల్లో ఓ బ‌హుళ జాతీయ కంపెనీకి ప‌నిచేస్తున్నా. అందుకే సంగీతానికి విరామం ఇచ్చాను.

కానీ నా పాట‌ను అభిమానించే వాళ్లు చాలా మంది ఎదురు చూస్తున్నారు. నేను ఎప్పుడు పాడ‌తానా? అని అడుగు తున్నారు. వాళ్ల కోస‌మే మ‌ళ్లీ కంబ్యాక్ అయ్యాను. ఇక‌పై కంటున్యూగా సినిమాలు చేయాల‌నుకుంటున్నా. కొత్త‌గా వ‌చ్చిన వారంతా ఎంతో బాగా ప‌ని చేస్తున్నారు. వైవిథ్య‌మైన బాణీల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. నాకొచ్చిన గ్యాప్ ని ఫిల్ చేయ‌డానికి కొత్త స్ట్రాట‌జీతో ముందుకు వెళ్లాల‌నుకుంటున్నా` అన్నారు.

Tags:    

Similar News