మెగాస్టార్ మనసులో కొరిక కుమారుడి రూపంలో!
శంకర్ దర్శకత్వంలో నటించాలని ఏ హీరో ఆశపడడు. ఆయనతో పనిచేయాలని ప్రతీ భారతీయ నటుడు కోరుకుంటారు.
శంకర్ దర్శకత్వంలో నటించాలని ఏ హీరో ఆశపడడు. ఆయనతో పనిచేయాలని ప్రతీ భారతీయ నటుడు కోరుకుంటారు. ఆయనతో కలిసి ఒక్క సినిమాకి పనిచేసిన అది గొప్ప అనుభూతిగా చెప్పుకుంటారు. ఇక ఆయన హీరోల ఎంపిక అన్నది చాలా సెలక్టివ్ గా ఉంటుంది. పాన్ వరల్డ్ లో మార్కెట్ ఉన్న హీరోల్నే ఎంపిక చేసుకుంటారు. ఆయన కథలు అలాగే ఉంటాయి. టెక్నీకల్ నేపథ్యం గల సినిమాలు చేసినా అందులోనూ తప్పని సరిగా తనదైన మార్క్ సందేశం ఉంటుంది.
అయితే ఒకప్పుడు పూర్తి స్థాయిలో ప్రాంతీయతని ఆధారంగా చేసుకుని సందేశాన్ని పాస్ చేసే వారు. ఇప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ సినిమాలు చేస్తున్నారు. గతంలో `రోబో` సినిమా ప్రచార సమయంలో మెగాస్టార్ చిరంజీవి సైతం శంకర్ తో పనిచేయాలని ఉందన్న మనసులో కోర్కెను బయటపెట్టారు. ఒకవేళ ఆయన చేయకపోయినా దానికి పెద్దగా ఫీల్ కానని..ఎవరితో చేసినా సంతోషిస్తాను అని అన్నారు. ఆ సమయంలో రజనీ కాంత్ కూడా ఉన్నారు. శంకర్ -చిరంజీవి కాంబినేషన్ ఎందుకు తీయకూడదంటే? ఆయన పాన్ వరల్డ్ మార్కెట్ ఉన్న స్టార్స్ తోనే చేస్తారని చిరంజీవి ఆ సమయంలో ఓపెన్ గానే చెప్పారు.
మళ్లీ ఇంత కాలానాకి ఆ వ్యాఖ్యలు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. సరిగ్గా చిరంజీవి కోరిక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూపంలో తీరుతుంది. ప్రస్తుతం చరణ్ హీరోగా శంకర్ `గేమ్ ఛేంజర్` అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కేవలం తెలుగులోనే ఈ సినిమా చేస్తున్నారు. మిగతా అన్ని భాషల్లో అనువాదా రూంపలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇది పొలిటికల్ థ్రిల్లర్ అని....చరణ్ ఐఏఎస్ నుంచి పొలిటీషయన్ గా టర్న్ అయ్యే పాత్రలో కనిపిస్తాడని ప్రచారం సాగుతోంది.
`ఒకే ఒక్కడు` రేంజ్ లో సినిమా సమాజాన్ని ...వ్యవస్థల్ని ప్రశ్నించేలా ఉంటుందని... ఇప్పటి సాంకేతిక తను వినియోగించుకుని..ట్రెండ్ ని ఫాలో అవుతూ అంతర్జాతీయ కంటెంట్ తోనే సినిమా ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ విషయంలో చిరంజీవి చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనతో కాకపోయినా కుమారుడితో శంకర్ సినిమా చేయడం పట్ల చిరు సంతోషాన్ని మాటల్లో వర్ణించలేనిది. ఈ సినిమా ప్రచార సమయంలో చిరంజీవి గత వ్యాఖ్యల్ని స్మరించుకునే అవకాశం ఉంది.