లంకాధిపతి, సీత ఒకేసారి అడుగు పెడతారా?
బాలీవుడ్ దర్శకుడు నితిష్ తివారీ ఇతిహాసం రామాయణం ఆధారంగా `రామాయణ్` ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ దర్శకుడు నితిష్ తివారీ ఇతిహాసం రామాయణం ఆధారంగా `రామాయణ్` ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రాముడి పాత్రలో రణబీర్ కపూర్.. సీత పాత్రలో సాయి పల్లవి...రావణుడి పాత్రలో యశ్..హనుమంతుడి పాత్రలో సన్నిడియోల్ లాంటి స్టార్లతో భారీ కాన్సాస్ పై తెరకెక్కిస్తున్నారు. కుంభకర్ణుడి పాత్రలో బాబి డియోల్ ఎంపిక చేసినట్లు ప్రచారంలో ఉంది. ఇంకా రామాయణంలో ఉన్న కీలక పాత్రలకు చాలా మంది ప్రముఖల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. ఇప్పటికే రాముడు, సీత పాత్రలకు సంబంధించిన చాలా సన్నివేశాలు పూర్తి చేసారు. ప్రస్తుతం షూటింగ్ ఇండోర్ లో నిర్వహిస్తున్నారు. ఇందులో కీలక పాత్ర ధారలు పాల్గొంటు న్నారు. అయితే లందకాధిపతి యశ్ ఇంకా సెట్స్ లో జాయిన్ కాలేదు. తాజాగా యశ్ సెట్స్ కి వెళ్లే డేట్ కూడా ఫిక్స్ అయింది. డిసెంబర్ నుంచి యశ్ షూట్ లో జాయిన్ అవుతాడని సమాచారం. టాక్సిక్ తో డేట్లు క్లాష్ అవ్వకుండా? రామాయణ్ కి ఇలా డేట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.
రావణుడి పాత్రకి సంబంధించి నితీష్ తివారీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ పాత్రకు సంబంధించి పూర్తిగా నిజమైన భంగారు ఆభరణాలే వినియోగిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన అనంతరం డిసెంబర్ లో మళ్లీ కొత్త షెడ్యల్ మొదలవుతుంది. ఈ షెడ్యూల్ షూటింగ్ సాయి పల్లవి కూడా తిరిగి జాయిన్ అవుతుంది. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించి కొంత పార్ట్ చిత్రీకరణ పూర్తయింది. డిసెంబర్ షెడ్యూల్ లో సాయి పల్లవిపై క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట.
అదే సమయంలో యశ్ కూడా షూటింగ్లో భాగమవుతాడు. అతడిపై షూట్ సహా సాయి పల్లవితో ఉన్న లింకింగ్ సన్నివేశాలు చిత్రీకరణ కూడా పూర్తి చేయనున్నారుట. ప్రస్తుతం యశ్ `టాక్సిక్` లో బిజీగా ఉండగా, సాయి పల్లవి కూడా ఇటీవల ప్రీ అయింది. ఆమె నటించిన `అమరన్` రిలీజ్ అవ్వడంతో సాయి పల్లవి బిజీ షెడ్యూల్ నుంచి ప్రీ అయింది.