గేమ్ ఛేంజర్‌.. ఇంత గట్టిగా చెబుతున్నారంటే..

దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్ పై అంచనాల సంగతి పక్కన పెడితే అసలు సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి.

Update: 2024-08-17 06:04 GMT

దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్ పై అంచనాల సంగతి పక్కన పెడితే అసలు సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఇండియన్ 2 దెబ్బకు రామ్ చరణ్ ఫ్యాన్స్ లో టెన్షన్ అయితే ఉంది. ఇక రామ్ చరణ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే.

ఇటీవలి కాలంలో శంకర్‌ పనితీరుపై కొంత సందేహాలు వ్యక్తం కావడంతో నిర్మాత దిల్ రాజు ఒక కొత్త వ్యూహంతో ఈ ప్రాజెక్ట్‌ను మరింత వేగవంతం చేశారు. ఆయన సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్‌లో హుషారు పెరిగింది. ఈ డబ్బింగ్ సెషన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఉత్సాహపరచాయి.

దిల్ రాజు క్రిస్మస్‌ 2024 లో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే ఇదే సమయంలో పుష్ప 2 కూడా డిసెంబర్ 6న విడుదల కానుంది. దీంతో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే సమయంలో థియేటర్లలో సందడి చేయడం కరెక్ట్ కాదని అందుకే వాయిదా పడవచ్చని కూడా టాక్ వచ్చింది. కానీ అది నిజం కాదని మేకర్స్ మరో పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. నిజానికి రెండు సినిమాల విడుదల డేట్ల మధ్య గ్యాప్ ఉండడంతో బాక్సాఫీస్ పైన పెద్దగా ప్రభావం చూపదు.

కరెక్ట్ గా డిసెంబర్ 25 క్రిస్మస్ సమయంలోనే సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నేడు శంకర్ పుట్టినరోజు సందర్భంగా SVC బ్యానర్ శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్ వదిలారు. బ్లాక్ బస్టర్ బర్త్ డే అంటూ 2024 క్రిస్మస్ నుంచి గేమ్ ఛేంజర్ సినిమాస్ లో సందడి చేయనున్నట్లు అధికారికంగా మరో క్లారిటీ ఇచ్చారు. కాబట్టి రిలీజ్ విషయంలో టెన్షన్ అక్కర్లేదు అని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ఇక శంకర్ భారతీయుడు 2 తర్వాత ఈ సినిమాపై తన పూర్తి దృష్టిని సారించారు. భారతీయుడు 2 సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో శంకర్ గేమ్ ఛేంజర్ ద్వారా విమర్శకులకు సరైన సమాధానం ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. ఈ సినిమాలోని కథనానికి, రామ్ చరణ్‌ పాత్రకు సంబంధించిన అంశాలకు మాస్ ఆడియెన్స్, మెగా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుందని శంకర్ భావిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ చిత్రంతో బాలీవుడ్‌ సహా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకోవాలని శంకర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక శంకర్ ఈ ప్రాజెక్ట్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి, తరువాత భారతీయుడు 3పై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్‌కి అభిమానులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో, సినిమా విడుదలయ్యాక ఏ విధంగా రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News