భారాన్ని కూడా బలంగా మార్చుకుంటా!
మరి ఇలాంటి వాటిని చరణ్ ఎలా అధిగమిస్తాడు? అంటే బారాన్ని..ఒత్తిడిని సైతం చరణ్ తన బలంగా మార్చుకుంటాడుట. ఎంతగా ఒత్తిడికి లోనైతే అంతగా తనలో బలం పుంజుకుంటుందని చెబుతున్నాడు.
'ఆర్ ఆర్ ఆర్' విజయంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిన సంగతి తెలిసిందే. నటుడిగా అతని స్థాయి పెరిగింది. పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ కి చేరడంతో? మరింత బాధ్యత పెరిగింది. దీంతో సహజంగానే నటుడిగా ఒత్తిడి పెరగడం సహజం. ఎలాంటి సినిమాలు చేయాలి? ఎలాంటి పాత్రల్లో నటించాలి? అన్న దానిపై లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒత్తిడికి గురికాక తప్పదు.
మరి ఇలాంటి వాటిని చరణ్ ఎలా అధిగమిస్తాడు? అంటే బారాన్ని..ఒత్తిడిని సైతం చరణ్ తన బలంగా మార్చుకుంటాడుట. ఎంతగా ఒత్తిడికి లోనైతే అంతగా తనలో బలం పుంజుకుంటుందని చెబుతున్నాడు. తనలో ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ఎప్పటికప్పుడు కొత్త ఎనర్జీని నింపుకుంటాడుట. తను తీసుకునే డైట్...జిమ్..యోగాలాంటివి తనని ఒత్తిడి నుంచి దూరం చేస్తాయని చెబుతున్నాడు.
ఇక చరణ్ 'ఆర్ ఆర్ ఆర్' సెట్స్ లో ఉండగానే ప్రీ ప్లాన్డ్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రన్నింగ్ లో ఉండగానే గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. దీంతో నో చెప్పకుండా వెంటనే ఆ ప్రాజెక్ట్ ని ఒకే చేసాడు. అదే 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా కాన్సెప్ట్ పై రకరకాల ప్రచారం జరుగు తుంది గానీ...అందులో క్లారిటీ లేదు. రిలీజ్ వరకూ ఆ స్పష్టత వచ్చే అవకాశం లేదు.
ఇక ఈ సినిమా తర్వాత చరణ్ ఏ దర్శకుడితో పనిచేస్తాడు? అన్నది అంతే ఆసక్తికరంగా మారింది. రేసులో ఇప్పటికే సుకుమార్ పేరు వినిపిస్తుంది. 'రంగస్థలం'తో బ్లాక్ బస్టర్ ఇవ్వడం సహా బన్నీని పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా తీర్చి దిద్దడంతో చరణ్ నమ్మకం సుకుమార్ పై మరింత బలపడింది. ఆయనతో సినిమా అంటే? మరో ఆలోచన లేకుండా ముందుకెళ్లిపోవచ్చు అన్న ధీమా అతనిలో కనిపిస్తుంది.