ఆ ప్రశ్నకు ఆర్జీవీ తెలివైన సమాధానం
తన సినిమాలతో నిజ జీవిత ప్రముఖులను అవహేళన చేసాడు. దీనివల్ల చాలా వివాదాల్ని తలకెత్తుకున్నాడు ఆర్జీవీ.
సమయం సందర్భాన్ని బట్టి తాను ఎలా స్పందించాలో తెలిసినవాడు ఆర్జీవీ. వివాదాలు ఎన్ని ఉన్నా వాటి నుంచి తప్పించుకోవడానికి కచ్ఛితంగా ఏదో ఒక తెలివైన ప్లాన్ తో ఉంటాడు. 2024 ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ గెలిచి మళ్లీ జగన్ సీఎం అవుతాడని ఆర్జీవీ బలంగా నమ్మాడు. అదే అదనుగా అతడు తెలుగు దేశం పార్టీ నాయకులు సహా మెగా హీరోలపై సెటైర్లు వేస్తూ పలు సినిమాల్ని తెరకెక్కించాడు. తన సినిమాలతో నిజ జీవిత ప్రముఖులను అవహేళన చేసాడు. దీనివల్ల చాలా వివాదాల్ని తలకెత్తుకున్నాడు ఆర్జీవీ.
అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలచిన చందంగా ఆర్జీవీ ఊహించిన దానికి భిన్నంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వైసీపీ అటకెక్కింది. తిరిగి తెలుగు దేశం పార్టీ మెగా కుటుంబ నాయకుడి అండతో ఘనంగా నెగ్గి అధికారం చేపట్టింది. తాజాగా మీడియా సమావేశంలో ఆర్జీవీకి ఊహించని ప్రశ్న ఎదురైంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసినట్లుగా రాజకీయ చిత్రాలు, బయోపిక్‌లు తీయాలనే ఆసక్తి ఉందా? అని ప్రశ్నించగా.. దానికి అస్సలు తడుముకోకుండా తెలివైన జవాబిచ్చాడు. దీని గురించి నన్ను అడుగుతారని నాకు ముందే తెలుసునని అన్నారు. ఇకపై తాను ఎలాంటి రాజకీయ చిత్రాలు చేయబోనని స్పష్టం చేశారు.
అయినా ఆర్జీవీ మాటలను నమ్మేదెలా. ఊసరవెల్లిలా సందర్భాన్ని బట్టి రంగులు మార్చే తెలివితేటలున్న వాడు. ఇప్పటికి ఇదే అతడి సమాధానం. రేపు ఎలాంటి అడుగు వేస్తాడో ఇప్పుడే ఊహించలేం. ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్, అ(క)మ్మ రాజ్యంలో కడప బిడ్డలు, వ్యూహం లాంటి సినిమాలు తీసిన ఆర్జీవీ ఇందులో చంద్రబాబు, లోకేష్ నాయుడు, పవన్ కల్యాణ్ సహా పలువురు నాయకుల పాత్రలను చూపించారు. ఈ పాత్రలను కించపరిచే విధంగా చూపించడంతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. కోర్టుల పరిధిలో తాఖీదులను ఎదురయ్యాయి. ఎన్నికల ముందు తన `వ్యూహం సినిమాని రిలీజ్ చేయలేక చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.