కల్కి రోల్.. RGV ఏమన్నారంటే..

సీనియర్ స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ ఈ మధ్యకాలంలో డైరెక్టర్ గా సినిమాలు చేయడం కంటే యాక్టర్ గా నటించాలనే కోరికతో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

Update: 2024-06-28 04:18 GMT

సీనియర్ స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ ఈ మధ్యకాలంలో డైరెక్టర్ గా సినిమాలు చేయడం కంటే యాక్టర్ గా నటించాలనే కోరికతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ మీద చేసిన షార్ట్ ఫిల్మ్ లో ఆర్జీవీ నటించాడు. అందులో అతని ఒరిజినల్ రోల్ నే పోషించారు. అయితే నటుడిగా బిగ్ స్క్రీన్ పై మొదటిసారి కల్కి 2898ఏడీ ద్వారా ఆర్జీవీ ఎంట్రీ ఇచ్చాడు.

ఈ విషయాన్ని ఆర్జీవీ స్వయంగా ట్విట్టర్ లో పేర్కొనడం విశేషం. నాగ్ అశ్విన్ సృష్టించిన విజువల్ స్పెక్టక్యులర్ మూవీ కల్కి 2898ఏడీ సినిమాలో చాలా మంది గెస్ట్ రోల్స్ చేశారు. రాజమౌళి కూడా చిన్న పాత్రలో కనిపించారు. అలాగే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఇంటరెస్టింగ్ పాత్రలు చేశారు. కాంట్రవర్సియల్ డైరెక్టర్ ఆర్జీవీని కూడా నాగ్ అశ్విన్ కల్కిలో ఒక పాత్ర కోసం తీసుకున్నారు.

ఆ పాత్రతో హ్యూమర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆర్జీవీ కూడా తన స్టైల్ ఆటిట్యూడ్ తో క్యారెక్టర్ ని బాగానే రక్తికట్టించారు. ఇదిలా ఉంటే తాజాగా ఆర్జీవీ ట్విట్టర్ లో నాగ్ అశ్విన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. నాగ్ అశ్విన్ నీ ఆలోచనలు, లక్ష్యాలు ప్రశంసనీయం, ఈ చిత్రంలో ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటి కంటే 100 రేట్లు డైనమిక్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపించాడు.

అలాగే నన్ను కల్కి2898ఏడీ ద్వారా నటుడిగా పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న అని ఆర్జీవీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అలాగే రాజమౌళి కూడా కల్కి సినిమాపై ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా మూవీ ఉందని చివరి 30 నిమిషాలు ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకొని వెళ్లిపోయారంటూ జక్కన్న నాగ్ అశ్విన్ ని ప్రశంసించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం మూవీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చిత్రం యూనిట్ కి అభినందనలు తెలియజేశారు.

ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 200+ కోట్లకి పైగానే మొదటి రోజు కలెక్షన్స్ నమోదు చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే ఫైనల్ లెక్కలు ఇంకా రావాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో థియేటర్స్ ఈ మూడు రోజులు హౌస్ ఫుల్ కావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. అలాగే నార్త్ లో కూడా సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Tags:    

Similar News