రామయ్య సెంచరీ సెంచరీ అలా మిస్!
ప్రతిభావంతులైన దర్శకులు -నటీనటులు-రచయితలు ఇలా ఎంతో మంది ఉషా కిరణ్ మూవీస్ ద్వారా పరిచయమయ్యారు.
రామోజీరావు మీడియా కింగే కాదు..అంతకు మంచి గొప్ప నిర్మాత కూడా. ఉషాకిరణ్ మూవీస్ పై ఎన్నో చిత్రాల్ని నిర్మించారు. ఈ బ్యానర్‌పై వివిధ భాషల్లో మొత్తం 85 చిత్రాలను నిర్మించిన ఘనత ఆయన సొంతం. రెండున్నర దశాబ్దాల కాలంలో ఎంతోమంనిది సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ప్రతిభావంతులైన దర్శకులు -నటీనటులు-రచయితలు ఇలా ఎంతో మంది ఉషా కిరణ్ మూవీస్ ద్వారా పరిచయమయ్యారు.
ఉషా కిరణ్ మూవీస్‌తో సినిమా అంటే తపన ఉన్న డైరెక్టర్లను, నటులనూ, మ్యూజిక్ డైరెక్టర్లను, రచయితలనూ పోత్సహించారు. ప్రస్తుతం తెలుగు సిని పరిశ్రమలో స్టార్ హిరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, సినీయర్ హీరో శ్రీకాంత్, దివగంత నటుడు ఉదయ్ కిరణ్ హీరో తరుణ్, దర్శకుడు తేజ, హీరోయిన్ శ్రియా లాంటి ఎంతోమంది నటులను తెలుగు సినిమాకు అందించారు. నిజ జీవితాల నుంచే కథలు పుడతాయని ఉషాకిరష్ సంస్థ నిరూపించింది.
అందుకు 'మయూరి' సినిమా ఓ ఉదాహరణ. ప్రమాదంలో కాలు పొగొట్టుకుని కృత్రిమ పాదంతో నాట్యంలో రాణించిన సుధా చంద్రన్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. 'మయూరి' సినిమాతోనే జైపుర్ పాదం గురించి దేశంవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. అలాగే ఓడిశా సంఘటన ఆధారంగా మౌన పోరాటం నిర్మించారు. జాతీయ క్రీడాకారణి అశ్వని నాచప్ప బయోపిక్ 'అశ్వని' వంటి చిత్రాలను నిర్మించి ఆయన అభిరుచి వేరు అని నిరూపించుకున్నారు.
ఇంకా 'కాంచన గంగ', 'ప్రతిఘటన', 'నువ్వేకావాలి', 'చిత్రం', 'ఆనందం', 'నచ్చావులే', 'బెట్టింగ్ బంగార్రాజు', 'నువ్విలా' వంటి ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. కన్నడ, తమిళ, మరాఠీ, ఆంగ్ల భాషాల్లో ఇప్పటివరకు 85 చిత్రాలను నిర్మించారు. మరో 15 సినిమాలు నిర్మించి ఉంటే సెంచరీ కొట్టేసేవారు. అయితే అందుకు సంబంధించిన పనులు కూడా రామోజీ రావు మొదలు పెట్టారుట. కొంత మంది దర్శకులతో చర్చలు జరపడం జరిగిందని సమాచారం. 2019 లోనే ఆ పనులు మొదలు పెట్టాలని చూసారుట. కానీ కరోనా వైరస్ తాండవించడంతో తాత్కాలికంగా ఆలోచన విరమించుకున్నారుట. ఆ విధంగా రామోజీరావు 100 సినిమాలు పూర్తి చేయలేకపోయారు.