రణబీర్.. టాలీవుడ్ లో ఆ రికార్డ్ పక్కా?
అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెలుగులో రాబోతున్న సినిమా యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక మందన జోడిగా ఈ సినిమా తెరకెక్కింది.
అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెలుగులో రాబోతున్న సినిమా యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక మందన జోడిగా ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ధియేటర్స్ లోకి వస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న కూడా తెలుగు, హిందీ భాషలలో యానిమల్ సినిమాపై హైప్ ఎక్కువగా ఉంది.
రణబీర్ కపూర్ లాంటి స్టార్ హీరో నుంచి వస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ ఫోకస్ అంతా యానిమల్ చిత్రం పైనే ఉంది. అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ లవ్ స్టోరీ తీసి యూత్ కి దగ్గరైన సందీప్ రెడ్డి వంగా నుంచి రాబోతున్న సినిమా కావడంతో తెలుగులో యానిమల్ పై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ మధ్యకాలంలో హిందీ సినిమాలు తెలుగు మార్కెట్ లో కూడా మంచి ఓపెనింగ్స్ ను రాబడుతున్నాయి.
రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర మూవీ తెలుగులో 6 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తర్వాత కూడా మంచి వసూళ్లు రాబట్టింది. రీసెంట్ గా షారుక్ ఖాన్ నుంచి వచ్చిన జవాన్ మూవీ అయితే ఏకంగా 10 కోట్ల గ్రాస్ మొదటిరోజు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. హిందీ నుంచి తెలుగులో డబ్ అయ్యి అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ సొంతం చేసుకున్న మూవీగా జవాన్ నిలిచింది.
ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఇప్పుడు యానిమల్ చిత్రానికి వచ్చింది. బడా నిర్మాత దిల్ రాజు యానిమల్ తెలుగు రైట్స్ సొంతం చేసుకుని రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ కానుండగా ఆ రోజు చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ రావడం లేదు. దీంతో ఎక్కువ స్క్రీన్స్ లో యానిమల్ చిత్రాన్ని ప్రదర్శించడానికి అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో ఖచ్చతంగా ఈ మూవీ మొదటి రోజు 15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
అదే జరిగితే తెలుగులో హైయెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ హీరోగా రణబీర్ కపూర్ రికార్డింగ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండడం తెలుగు నాట మరింత హైప్ క్రియేట్ కావడానికి స్కోప్ ఉంది. ఇప్పటికే యానిమల్ ట్రైలర్ తో సందీప్ రెడ్డి వంగ సినిమాపై దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇది ఈ సినిమా ఓపెనింగ్స్ కి ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాలి.