రామాయణంపై రాముడు ఇంట్రెస్టింగ్ అప్ డేట్!
ఇందులో రణబీర్ కపూర్ పాత్ర షూటింగ్ మొత్తం పూర్తయినట్లు ఓఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ రివీల్ చేసాడు.
బాలీవుడ్ దర్శకుడు నితిష్ తివారీ ఇతిహాసం రామాయణం ఆధారంగా 'రామాయణ్' ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రాముడి పాత్రలో రణబీర్ కపూర్.. సీత పాత్రలో సాయి పల్లవి...రావణుడి పాత్రలో యశ్..హనుమంతుడి పాత్రలో సన్నిడియోల్ లాంటి స్టార్లతో భారీ కాన్సాస్ పై తెరకెక్కిస్తున్నారు. కుంభకర్ణుడి పాత్రలో బాబి డియోల్ ఎంపిక చేసినట్లు ప్రచారంలో ఉంది. ఇంకా రామాయణంలో ఉన్న కీలక పాత్రలకు చాలా మంది ప్రముఖల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. ఇప్పటికే రాముడు, సీత పాత్రలకు సంబంధించిన చాలా సన్నివేశాలు పూర్తి చేసారు. తాజాగా సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఇందులో రణబీర్ కపూర్ పాత్ర షూటింగ్ మొత్తం పూర్తయినట్లు ఓఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ రివీల్ చేసాడు. రామాయణం మొదటి భాగంలో తన పాత్రకు సంబంధించి షూట్ పూర్తయినట్లు వెల్లడించాడు.
త్వరలోనే రెండవ భాగం షూటింగ్ మొదలవుతుందన్నారు. రాముడి పాత్రను పోషించడం ఓ గౌరవంగా భావిస్తు న్నట్లు తెలిపారు. భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, భార్య భర్తల బంధం గురించి ఈ చిత్రం ఎంతో చక్కగా వివరిస్తుందని రణబీర్ గుర్తు చేసారు. భారతీయ ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోన్న సంగతి తెలిసిందే. నేచురల్ పెర్పార్మర్ గా ఆమెకు మంచి పేరుంది.
ఇప్పటికే సీత పాత్ర ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. అచ్చంగా సీతాదేవినే సాయి పల్లవి తలపిస్తుంది. ఆ అందమైన సీతను అపహరించే లంకాధి పతి రావణుడి పాత్రలో యశ్ నటిస్తున్నాడు. రావణుడి పాత్రకి సంబంధించి నితీష్ తివారీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ పాత్రకు సంబంధించి పూర్తిగా నిజమైన భంగారు ఆభరణాలే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మొదటి భాగం ముగింపుకు సంబంధించి ఓ కీలక షెడ్యూల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సాయి పల్లవి, యశ్ పాల్గొంటున్నట్లు తెలిసింది.