కావాల‌నే మా మ‌ధ్య‌ గాజు గోడ‌ను ఉంచాను: రిషీ క‌పూర్

ఇటీవ‌లే `యానిమ‌ల్` సినిమాలో న‌టించాడు ర‌ణ‌బీర్ క‌పూర్. ఈ సినిమా క‌థాంశం యాథృచ్ఛికంగా త‌న నిజ జీవిత క‌థ‌తో పోలి ఉంది.

Update: 2024-09-16 03:53 GMT

ఇటీవ‌లే `యానిమ‌ల్` సినిమాలో న‌టించాడు ర‌ణ‌బీర్ క‌పూర్. ఈ సినిమా క‌థాంశం యాథృచ్ఛికంగా త‌న నిజ జీవిత క‌థ‌తో పోలి ఉంది. త‌న తండ్రికి త‌న‌కు మ‌ధ్య గాజు గోడ అడ్డుగా ఉంటే దానివ‌ల్ల బాల్యంలో అత‌డు అనుభ‌వించే వ్య‌థ ఎలాంటిది? అన్న‌దే యానిమ‌ల్ క‌థ‌. తండ్రి అంటే గొప్ప ప్రేమ ఉన్న కొడుకు, త‌న‌ను అంగీక‌రించ‌ని తండ్రితో ఎలాంటి ఘ‌ర్ష‌ణను ఎదుర్కొన్నాడు? ఎలాంటి వేద‌న అనుభ‌వించాడు? అన్న‌దానిని ఎంతో ఎమోష‌న‌ల్ గా చూపించాడు సందీప్ వంగా. నేటిత‌రం ద‌ర్శ‌కుల్లో ఇంత ఇంటెన్స్ గా ఇద్ద‌రి మ‌ధ్యా ఘాడానుబంధాన్ని, ఎమోష‌న్ ని చూపించ‌గ‌లిగే మ‌రొక ద‌ర్శ‌కుడు లేడు అని అంతా అంగీక‌రించారు.

ఇదంతా ఒకెత్తు అనుకుంటే, త‌న నిజ‌జీవిత తండ్రి రిషీక‌పూర్ కి త‌న‌కు మ‌ధ్య ఉన్న దూరం గురించి ర‌ణ‌బీర్ బ‌హిరంగంగా మాట్లాడాడు. త‌మ మ‌ధ్య అడ్డు గోడ ఉంద‌(యానిమ‌ల్ లోను ఈ సీన్ ఉంది)ని కూడా తెలిపాడు. దానివ‌ల్ల త‌న తండ్రితో ప్ర‌తిదీ మాట్లాడ‌లేని ప‌రిస్థితి. రిషీజీకి కోపం కూడా ఎక్కువ‌! త‌న త‌ల్లితో తండ్రి రిషీ క‌పూర్ గొడ‌వ ప‌డేప్పుడు తాను నిద‌ర‌లేని రాత్రులు గ‌డిపాన‌ని, చాలా ఏడ్చాన‌ని కూడా ర‌ణబీర్ ఓ ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు.

రిషి కపూర్ కూడా ఒకసారి త‌న కొడుకు రణబీర్ కపూర్‌తో తన సంబంధం గురించి మాట్లాడాడు. 2015లో ది అనుపమ్ ఖేర్ షో - కుచ్ భీ హో సక్తా హై! సీజన్ 2లో జరిగిన చాట్‌లో రిషి మాట్లాడుతూ.. తాను స్నేహానికి బదులుగా రణ్‌బీర్‌తో తండ్రీ కొడుకుల సంబంధాన్ని ఇష్టపడతానని చెప్పాడు. రణబీర్ కి త‌న‌కు మధ్య గాజు గోడ గురించి మాట్లాడాడు. రిషి కపూర్ మాట్లాడుతూ-``సినిమా పరిశ్రమలో తమ పిల్లలను తమ స్నేహితులుగా భావించే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. మా నాన్నతో నాకు అలాంటి సంబంధం లేదు. నేను ఉద్దేశపూర్వకంగా కొడుకుతో అలాంటి సంబంధం కావాల‌నుకోలేదు. నా కొడుక్కి నాకు మ‌ధ్య ఒక గాజు గోడ అడ్డుగా ఉంచాను! అని తెలిపాడు. మేము ఒకరినొకరు చూడగలుగుతాం.. కానీ అనుభూతి చెందలేము. నేను ఇది కోరుకున్నాను..నేను మీ అంద‌రికీ పెద్దను.. మీ తండ్రిని. నేను మీ స్నేహితుడిని కాదు! మీరు నాకు ఆ పదవిని ఇవ్వండి అని అడిగాను.

అలా ఎందుకు? అని ప్ర‌శ్నించ‌గా.. రిషి క‌పూర్ త‌న సంభాష‌ణ‌ను ఇలా కొనసాగించాడు. నేను రణబీర్‌తో అలా కోరుకున్నాను..బహుశా నేను మా తాత - నాన్న లాంటి వారిని చూశాను. మా నాన్న నాతో అలా చేశాడు! అని రిషీ క‌పూర్ తెలిపాడు. నువ్వు రణబీర్‌కి ఏమి ఇచ్చావు? అంటే.. నేను రణబీర్‌కి ఇచ్చాను..నువ్వు నీ పెద్దలను గౌరవించావు.. నీ జీవితంతో నీకు ఏది కావాలంటే అది చెయ్యి.. కానీ మేము ఉంచిన ఈ గోడ అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను.. అని అన్నారు.

రిషీజీ నీతూ సింగ్‌ను (ప్రస్తుతం నీతూ కపూర్) 1980లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు రణబీర్ - రిద్ధిమా కపూర్ ఉన్నారు. రిషి 30 ఏప్రిల్ 2020న ముంబైలో మరణించారు. అతడి చివరి చిత్రం శర్మాజీ నమ్‌కీన్ (2022).

Tags:    

Similar News