రణ్ బీర్ ఫ్లోర్ ని తుడిచే పరిస్థితి ఎందుకొచ్చింది..?
బాలీవుడ్ నటుడు రిషి కపూర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన తనయుడిగా రణ్ బీర్ కపూర్ కూడా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు
బాలీవుడ్ నటుడు రిషి కపూర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన తనయుడిగా రణ్ బీర్ కపూర్ కూడా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఎంత పెద్ద స్టార్ హీరో కొడుకైనా కూడా సెట్స్ లో ఫ్లోర్ తుడిచాడట రణ్ బీర్ కపూర్. సినీ నేపథ్యం ఉన్నా కూడా రణ్ బీర్ తనను తాను స్టార్ గా గుర్తించబడేలా చేసుకున్నాడు. అసలు రణ్ బీర్ ఎందుకు ఫ్లోర్ క్లీన్ చేశాడు.. రణ్ బీర్ సినీ ప్రయాణం ఎలా మొదలైంది అన్నది ఓసారి చూద్దాం..
రణ్ బీర్ తల్లిదండ్రులు ఇద్దరు బాలీవుడ్ లో నటులే. నీతూ సింగ్ నటిగా కొన్ని సినిమాలే చేసినా రిషి కపూర్ సినీ ప్రస్థానం గురించి తెలిసిందే. అయితే రిషి కపూర్ కొడుకుగా డైరెక్ట్ గా రణ్ బీర్ హీరోగా అడుగు పెట్టలేదు. సినిమాల మీద ఆసక్తి ఉండగా ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క సినిమాపై అవగాహన పెంచుకునే నటించాలని అనుకున్నారు రణ్ బీర్ కపూర్. రణ్ బీర్ హీరోగా రాణిస్తున్నా అతను మొదట సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. టెంత్ పూర్తి కాగానే ఆ అబ్ లౌట్ చలే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు రణ్ బీర్ కపూర్. ఆ సినిమాను రిషి కపూర్ డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత న్యూయార్క్ వెళ్లి అక్కడ ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.
ఆ టైం లోనే రెండు షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశారు రణ్ బీర్ కపూర్. కోర్స్ కంప్లీట్ చేసి ఇండియాకు వచ్చాక 2005లో బ్లాక్ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. సంజయ్ లీలా భన్సాలి డైరెక్ట్ చేసిన ఆ సినిమా షూటింగ్ టైం లో ఫ్లోర్ తుడవడం నుంచి సెట్ లో బల్బులు పెట్టడం లాంటి పనులన్నీ చేశానని అన్నారు రణ్ బీర్ కపూర్. ఆ టైం లో అతను పడుతున్న కష్టాన్ని సినిమాపై అతనికి ఉన్న కమిట్మెంట్ ని చూసి భన్సాలి రణ్ బీర్ ని హీరోగా పరిచయం చేశారు.
హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా రణ్ బీర్ సినిమాలు చేస్తూ వచ్చారు. కమర్షియల్ సినిమాలతో పాటుగా కథా బలం ఉన్న సినిమాలను కూడా చేశారు. రణ్ బీర్ కపూర్ నటించిన తొలి సినిమా సావరియా.. 2007 లో రిలీజైన ఈ సినిమా అంత గొప్ప టాక్ తెచ్చుకోలేదు. నటుడిగా రణ్ బీర్ కు మంచి పేరు తెచ్చింది. మొదటి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ సహా ఇంకా చాలా అవార్డులను అందుకున్నారు.
ఆ తర్వాత బచ్నా యే హసీనో, అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ, వేకప్ సిద్, రాకెట్ సింగ్ లాంటి రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమాలతో అలరించింది. ఇక రాజ్ నీతి లాంటి సినిమా అతను లోని నటుడిని బయటపెట్టింది. ఇక రాక్ స్టార్ గా రణ్ బీర్ చేసిన సంచలనాలు తెలిసిందే. బర్ఫీ తో చెవిటి మూగవాడిగా అదరగొట్టగా.. సంజు సినిమాతో సంజయ్ ను తలపించే నటనతో మెప్పించాడు.
ఎంచుకున్న కథకు దర్శకుడు రాసుకున్న పాత్రకు తనను తాను మార్చుకునేందుకు ఎక్కడ రాజీ పడలేదు రణ్ బీర్ కపూర్. ఆయనలోని ఆ పట్టుదలే బాలీవుడ్ లో ఆయనకు ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. మిగతా హీరోలంతా రీమేక్ లతో హిట్లు కొడుతున్నా రీమేక్ లపై ఆసక్తి చూపించని రణ్ బీర్ కెరీర్ లో కొన్నాళ్లు వరుస ఫ్లాపులు చవిచూసినా ఎక్కడ నిరాశ చెందకుండా మళ్లీ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ వచ్చారు.
బ్రహ్మాస్త్ర పార్ట్ 1 తో పాన్ ఇండియా ఆడియన్స్ ని మెప్పించిన రణ్ బీర్ తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఇప్పుడు యానిమల్ తో మరోసారి తన సత్తా చాటేందుకు వస్తున్నారు. 16 ఏళ్ల సినీ కెరీర్ లో తనదైన శైలిలో నటిస్తూ వస్తున్న రణ్ బీర్ కపూర్ యానిమల్ తో మరో మెట్టు ఎక్కాలని చూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుంది. సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఈ సినిమాతో రణ్ బీర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.