ర‌ణ‌బీర్ క‌పూర్ కాపురం ట్రంపు ట‌వ‌ర్ కి మార్చేస్తున్నాడా?

తాజాగా బాలీవుడ్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా పూణేలోని ట్రంప్ టవర్స్‌లో ఉన్న రెసిడెన్షియల్ యూనిట్‌ని మూడు సంవత్సరాల పాటు నెలవారీ అద్దె రూ. 4 లక్షలకు లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Update: 2023-09-21 07:13 GMT

స్టార్ హీరోల ఆదాయం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కోట్ల‌లో ఆదాయం ఉంటుంది. సినిమా పారితోషికా లే కాకుండా ఎండార్స్ మెంట్స్ ద్వారా కోట్ల రూపాయ‌ల ఆదాయం స‌మ‌కూరుతుంది. ఇంకా ఇత‌ర రంగాల్లో పెట్టుబ‌డులు.. వ్యాపారాల ద్వారా ఏటా ఆదాయం ఖాతాలో జ‌మ అవుతుంది. మెట్రో సిటీల్లో ఖ‌రీదైన ల‌గ్జ‌రీ విల్లాస్ క‌లిగి ఉంటారు. అలాగే సొంత ప్రాంతంలోనూ లెక్క‌కు మించి ఆస్తులు..విల్లాలు ఉంటాయి.

కానీ కొంత మంది హీరోలు ల‌క్ష‌లు..కోట్ల రూపాయాలు అద్దెలు..లీజులు చెల్లించి బ‌య‌ట అపార్ట్ మెంట్ల‌లో ఉండ‌టానికి ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌రి ఈ సెంటిమెంట్...సీక్రెట్ ఏంటో తెలియ‌దు గానీ...తాజాగా బాలీవుడ్ హీరో ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా పూణేలోని ట్రంప్ టవర్స్‌లో ఉన్న రెసిడెన్షియల్ యూనిట్‌ని మూడు సంవత్సరాల పాటు నెలవారీ అద్దె రూ. 4 లక్షలకు లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఒప్పందంలో భాగంగా 24 లక్షల రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌ని చెల్లించారు. ఈ లీజు మరియు లైసెన్స్ ఒప్పందం సెప్టెంబర్ 15, 2023న కుదిరిన‌ట్లు తెలుస్తోంది. నెలవారీ అద్దె మొదటి ఏడాది రూ.4 లక్షలు, రెండో ఏడాది రూ.4.2 లక్షలు, మూడో ఏడాది నెలకు రూ.4.41 లక్షలు అని డాక్యుమెంట్‌లో రాసి ఉంది. ఆ ప్ర‌కారం ట్రంప్ ట‌వ‌ర్ కి ర‌ణ‌బీర్ అద్దె చెల్లించాల్సి ఉంది. పూణేలోని ఎరవాడలో 10వ అంతస్తులో 6094 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఉంది.

మ‌రి ఉన్న‌ట్లుండి ర‌ణ‌బీర్ ఎందుకు లీజుకు తీసుకున్నారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. భార్య అలియాభ ట్..పాపాయి తో క‌లిసి కాపురం ట్రంప్ ట‌వ‌ర్ కి మార్చేస్తున్నాడా? లేక ఏదైనా ఆఫీస్ ప‌ర్ప‌స్ లో అద్దెకు తీసుకున్నాడా? అన్న‌ది తెలియాలి. ముంబైలో ఖ‌రీదైన ప్రాంతాల్లో ర‌ణ‌బీర్ కి సొంతం అపార్ట్ మెంట్లు ఉన్నాయి. అలాగే నాన్న వార‌స‌త్వం గా వ‌స్తోన‌న పురాత‌న బిల్డింగ్ లున్నాయి. కానీ వాటి వేటి జోలికి వెళ్ల‌కుండా ర‌ణ‌బీర్ క‌పూర్ ఇలా కొత్త ప్లాట్ తీసుకోవ‌డం చాలా సందేహాల‌కి తావిస్తోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో నెలకు దాదాపు రూ. 1.5 లక్షల అద్దెకు మూడేళ్లపాటు ఒక ఫ్లాట్‌ను లీజుకు తీసుకున్నారు. సొంతిల్లు ఉన్నా ఎక్కువ‌గా అందులోనే ఉంటారు.

Tags:    

Similar News