నాతో రేప్ సీన్ కి ఆమె నో చెప్పింది
కానీ 1980 మరియు 90 ల్లో ఎక్కువ శాతం సినిమాల్లో రేప్ సీన్ లు ఉండేవి.
ఈ మధ్య కాలంలో సినిమాల్లో రేప్ సన్నివేశాలు ఎక్కువగా కనిపించడం లేదు. కానీ 1980 మరియు 90 ల్లో ఎక్కువ శాతం సినిమాల్లో రేప్ సీన్ లు ఉండేవి. విలన్ లు హీరోయిన్స్ ను లేదా ఇతర ఆడవారిని రేప్ చేసినట్లుగా చూపించడం లేదంటే బలవంతం చేయబోతే హీరో వచ్చి కాపాడటం వంటి సీన్స్ ఉండేవి.
ఇప్పుడు రేప్ సీన్స్ ను జనాలు ఆదరించడం లేదని ఎక్కువగా వాడటం లేదు. కథ డిమాండ్ చేస్తే తప్ప రేప్ సీన్ ఉండటం లేదు. గతంలో చాలా మంది సీనియర్ హీరోయిన్స్ రేప్ సీన్స్ లో ఇష్టం లేకుండానే నటించిన దాఖలాలు ఉన్నాయి. సీనియర్ నటుడు రంజిత్ ఒక ఇంటర్వ్యూలో రేప్ సీన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
1989 లో వచ్చిన రొమాంటిక్ మూవీ ప్రేమ్ ప్రతిజ్ఞ లో హీరోగా మిథున్ చక్రవర్తి నటించగా హీరోయిన్ గా మాధురి దీక్షిత్ నటించారు. ఆ సినిమాలో ఒక సన్నివేశంలో తోపుడు బండి మీద మాధురి దీక్షిత్ ను నేను రేప్ చేసే సన్నివేశంను దర్శకుడు చేయాలని అనుకున్నాడు.
నాతో ఆ సన్నివేశానికి మాధురి దీక్షిత్ అస్సలు ఒప్పుకోలేదట. దర్శకుడు మరియు నిర్మాత పదే పదే విజ్ఞప్తి చేసిన తర్వాత ఆమె అందుకు అంగీకరించింది. ఆ సన్నివేశం షూటింగ్ చేస్తున్న సమయంలో ఆమె చాలా ఇబ్బంది పడి ఉంటుందని నటుడు రంజిత్ అన్నాడు.
సినిమాలో ఆ సన్నివేశం యొక్క ప్రాముఖ్యత నేపథ్యంలో ఆమె చేసేందుకు ఒప్పుకుంది అంటూ అప్పట్లో సినిమా మేకర్స్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు హీరోయిన్స్ మాత్రం రేప్ సీన్ అంటే ఆసక్తి చూపించక పోవచ్చు. అయినా ప్రేక్షకులు కూడా అలాంటి సీన్స్ ను ఆశించడం లేదు.