బట్టలిప్పి షో చేసిన నటుడు అందుకు అనర్హుడా?
అప్పటి శక్తిమాన్ క్యారెక్టర్ ని నటుడు.. నిర్మాత ముఖేష్ ఖన్నా పోషించారు. తాజాగా శక్తిమాన్ పాత్రకి మళ్లీ రణవీర్ సింగ్ ప్రాణం పోస్తున్నాడు.
హిందీ టీవీ సీరియల్ ‘శక్తిమాన్’ సినిమాగా రాబోతున్న సంగతి తెలిసిందే. 90వ దశకంలో హిట్ సీరియల్ గా నిలిచిని శక్తిమాన్ బుల్లి తెరపై ఓ సంచలనం. పిల్లలకు ఇష్టమైన టీవీ సీరియల్స్ లో ఒకటి శక్తిమాన్ గా నిలిచింది. హిందీలో డీడీ నేషనల్ లో ప్రసారం అయిన సీరియల్ రీజనల్ భాషల్లో కూడా డబ్ అయి హిట్ అయింది. నేషనల్ లోనే 1997 నుంచి 2005 వరకు ఈ సీరియల్ ప్రసారం అయింది .ఇండియాస్ ఫస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్ గా శక్తిమాన్ ఖ్యాతికెక్కింది. అప్పట్లో శక్తిమాన్ ఫోటోని వాడుకొని వస్తువులు.. కంపెనీలు కూడా ప్రమోషన్ చేశాయి.
అప్పటి శక్తిమాన్ క్యారెక్టర్ ని నటుడు.. నిర్మాత ముఖేష్ ఖన్నా పోషించారు. తాజాగా శక్తిమాన్ పాత్రకి మళ్లీ రణవీర్ సింగ్ ప్రాణం పోస్తున్నాడు. శక్తిమాన్ పాత్రతో ఏకంగా ఓ సినిమానే ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రణవీర్ ని హీరోగా ఎంపిక చేసారు. ఈ పాత్రకి బాలీవుడ్ లో ఏ నటుడ్ని తీసుకోవాలా? అని సీరియస్ ఆలోచనల తర్వాత రణవీర్ సింగ్ ని ఫైనల్ చేసారు. ఇదే సినిమాలో ముఖేష్ ఖన్నా కూడా భాగమవు తున్నట్లు ప్రచారం సాగింది.
అయితే తాజాగా ముకేష్ ఖన్నా ..రణవీర్ ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒంటిమీద బట్టలు లేకుండా ఫోటో షూట్ లు చేసుకునే ఈ హీరో ఇలాంటి పాత్ర చేయకూడదని ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ కాసేపటికి మళ్లీ డిలీట్ చేసాడు. పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేయడంపై అతని అభిప్రాయం ఏంటి? అన్నది స్పష్టంగా అర్దమువుతుంది. ఈ పాత్రకి రణవీర్ తగినవాడు కాదని ముకేష్ వ్యాఖ్యని బట్టి తెలుస్తోంది.
మరి దీనిపై రణవీర్ సింగ్ ఎలా స్పందిస్తాడు? అన్నది చూడాలి. అయితే ముకేష్ కామెంట్ పై రణవీర్ సింగ్ అభిమానులు అసహనం వ్యక్తం చేసారు. ఎన్నోవైవిధ్యమైన పాత్రలు పోషించిన అతడు ఎందుకు అనర్హుడంటూ మడిపడుతున్నారు.ఈ చిత్రాన్ని సోని పిక్చర్ ఆధ్వర్యంలో మరో రెండు సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. కన్నడిగీ బాసిల్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడలో ఇతనికి మంచి పేరుంది. అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గా ఖ్యాతికెక్కారు.