ఫ్యాన్స్ గెస్ చేసారు స్టార్ షురూ చేసాడు!
సరైన కథ కుదిరితో ఈ కాంబినేషన్ లో సినిమా తప్పక ఉంటుందని అభిమానులు గెస్ చేసారు.
కొన్నిసార్లు ఊహలు కూడా నిజమవుతుంటాయి. కానీ చాలా తక్కువ సందర్భాల్లోనే అలా జరుగుతుంది. ఆ విషయంలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ సక్సెస్ అయ్యాడు. కొంతకాలంగా ఆయన అభిమానులు ఉరి దర్శకుడు ఆదిత్య ధర్ తో సినిమా చేస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. దీంతో నెట్టింట ఊహాగానాలు మొదలయ్యాయి. సరైన కథ కుదిరితో ఈ కాంబినేషన్ లో సినిమా తప్పక ఉంటుందని అభిమానులు గెస్ చేసారు.
కానీ వీటిపై ఏనాడు రణవీర్ గానీ, అదిత్య గానీ స్పందించలేదు. అలాగని ఇది సాద్యం కాదు అని చెప్పింది లేదు. అయితే ఇప్పుడా అభిమానుల ఇప్పుడా గెస్సింగ్ ని రణవీర్ నిజం చేస్తున్నాడు. తమ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని రణవీర్ ప్రకటించాడు. ఓ సినిమా కోసం కన్న కల నెరవేడమంటే ఇదే . మునుపెన్నడు చూడని అద్భుతమైన తారాగాణంతో ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతోఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రేక్షకుకులను అబ్బుర పరచడానికి సిద్దంగా ఉందీ సినిమా` అని అన్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు సైతంభాగమవుతున్నారు. సంజయ్ దద్, మాధవన్, అర్జున్ రాంపాల్ , అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారుట. ఈ చిత్రాన్ని నిర్మించడానికి జియో స్టూడియోస్- బి62 స్టూడియోస్ ముందుకొచ్చాయి. `ఉరి: ది సర్జికల్` తర్వాత ఆధిత్య ధర్ తెరకెక్కిస్తోన్న భారీ సినిమా ఇదేనని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా కంటెంట్ ఎలా ఉండబోతుంది? అన్న ఆసక్తి అభిమానుల్లో మొదలైపోయింది.
ఇంతమంది స్టార్లను రంగలోకి దించుతున్నారంటే? కథలో చాలా ప్రత్యేకత ఉండటానికి అవకాశం ఉంది. అయితే రణవీర్ ప్రకటనతో అభిమానుల్లో జోష్ నిండింది. ఆ కాంబినేషన్ లో సినిమా చూడాలని ఎప్పటి నుంచో అనుకుం టున్నామని అది ఇప్పుడు జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.