అత‌డిని లాగిపెట్టి లెంప‌కాయ కొట్టి బుద్ది చెప్పింది!

స్టార్ హీరోయిన్ల నుంచి న‌వ‌త‌రం భామ‌ల వ‌ర‌కూ త‌మ అనుభ‌వాలు చెప్పుకొచ్చారు.

Update: 2024-11-13 13:22 GMT

బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఇప్ప‌టికే ఎంతో మంది న‌టీమ‌ణులు స్పందించారు. ఇండ‌స్ట్రీలో త‌మ అనుభ వాల్ని.. కెరీర్ ఆరంభంలో ఎదురైన సంఘ‌ట‌ల గురించి ఎన్నో సందర్భాల్లో ఓపెన్ అయ్యారు. స్టార్ హీరోయిన్ల నుంచి న‌వ‌త‌రం భామ‌ల వ‌ర‌కూ త‌మ అనుభ‌వాలు చెప్పుకొచ్చారు. ఇటీవ‌ల కాస్టింగ్ కౌచ్ అంశం మాలీవుడ్ ని కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. జ‌స్టిస్ హేమ క‌మిటీ నివేదిక‌తో దేశం ఒక్క‌సారిగా షాక్ అయింది. ఆ ప్ర‌భావం అన్ని పరిశ్ర‌మ ల‌పైనా ప‌డింది. ప్ర‌తిగా ఆయా ప‌రిశ్ర‌మ‌లు అలెర్ట్ అయ్యాయి.

తాజాగా మ‌రో బాలీవుడ్ న‌టి, భోజ్ పురీ న‌టి ర‌ష్మీ దేశాయ్ కాస్టింగ్ కౌచ్ గురించి ఆస‌క్తిక‌ర జాతీయ మీడియాతో చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. `ఓ సినిమా కోసం నన్ను ఆడిషన్ కోసం పిలిచారు. అప్పుడు నా వయసు 16 ఏళ్లు. ఆడిషన్ కు నన్ను ఒంటరిగా రమ్మన్నారు. దాంతో నేను కాస్త తడబడ్డాను. అక్కడ ఓ వ్యక్తి ఉన్నాడు. తాను నన్ను ఓ రూమ్ లోకి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అత‌నేం చేసాడో? తెలియదు.

కొద్ది సేపటికే నేను అపస్మారక స్థితిలోకి వెళ్లి స్పృహ కోల్పోయాను. ఆ సమయంలో చాలా అసౌకర్యంగా అనిపించి, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుని బయటకు వచ్చేశాను. తర్వాత ఇంటికి వెళ్లి మా అమ్మకు అంతా చెప్పా. మరుసటి రోజు మా అమ్మ, నేను ఆ వ్యక్తిని కలవడానికి వెళ్ళాము. నాతో అనుచితంగా ప్రవర్తించి నందుకు ఆ వ్యక్తికి గుణపాఠం చెప్పాలని మా అమ్మ అతని చెంపపై కొట్టింది.

ఆ వ్యక్తికిది ఖచ్చితంగా మరిచిపోలేని రోజు అని నేను భావిస్తున్నాను. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు జరుగుతాయి. ప్రతి రంగంలో మంచివారు, చెడ్డవారు ఉంటారు. సినిమా పరిశ్రమలో మంచి అనుభవాన్ని పొందేందుకు కొంతమంది అద్భుతమైన వ్యక్తులతో కలిసి చేయాలను కుంటున్నాను` అని చెప్పుకొచ్చింది.

ర‌ష్మీ దేశాయ్ భోజ్ పురి న‌టిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2006లో జీ టీవీలో ప్రసారమైన `రావణ్` సీరియల్‌లో మండోదరి పాత్రతో ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకుంది. హిందీ సీరియల్ `ఉత్తరన్‌`లో నటించింది. దీంతో బాలీవుడ్ లో అభిమానులు ఏర్ప‌డ్డారు. ఈ సీరియల్ తో అవార్డులు..రివార్డులు సొంతం చేసుకుంది. అటుపై `దిల్ సే దిల్ తక్`, `ఝలక్ థిక్లా జా`, `ఖత్రోన్ కే ఖిలాడీ` సీరియల్‌లో నటించింది.

Tags:    

Similar News