కుర్రభామలకు నిద్రలేకుండా చేస్తోన్న నేషనల్ క్రష్!
`పుష్ప-2` విజయంతో పాన్ ఇండియాలో నేషనల్ క్రష్ రష్మిక రేంజ్ అంతకంతకు రెట్టింపు అయింది. అన్ని భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయి.
`పుష్ప-2` విజయంతో పాన్ ఇండియాలో నేషనల్ క్రష్ రష్మిక రేంజ్ అంతకంతకు రెట్టింపు అయింది. అన్ని భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. కానీ అమ్మడు మాత్రం సెలక్టివ్ గా వెళ్తుంది. ఎక్కువగ బాలీవుడ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. అలాగని మిగతా భాషల్ని లైట్ తీసుకోలేదు. అన్ని అంశాలు పరిశీలించి పక్కా హిట్ కొడుతుందంటే సైన్ చేస్తోంది. అయితే రష్మిక ఇలా దూకుడు చూపించడంతో చాలా మంది యంగ్ హీరోయిన్లకు గండి పడుతుంది.
వాళ్లకు రావాల్సిన అవకాశాలు రష్మిక ఎగరేసుకుపోతుందనే వాదన తెరపైకి వస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ యంగ్ బ్యూటీలకు నిద్ర పట్టనివ్వడం లేదు. ప్రస్తుతం రష్మిక `ఛావా`లో నటిస్తోంది. ఇందులో మహారాష్ట్ర క్వీన్ పాత్రలో నటిస్తుంది. ప్రిన్సెస్ పాత్ర అంటే చిన్న విషయమా ఎంతో స్టార్ డమ్ ఉంటే తప్ప సాధ్యం కాని రోల్ అది. అలాంటిది దర్శకుడు లక్ష్మణ్ ఉట్టేకర్ రష్మికని పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అనన్యా పాండే లాంటి భామల్ని కనీసం కన్సిడర్ కూడా చేయకుండా రష్మికని ప్రాజెక్ట్ కి లాక్ చేసారు.
అలాగే సల్మాన్ ఖాన్ కి జోడీగా `సికిందర్` లోనూ రష్మిక నటిస్తోంది. ఇంకా `స్త్రీ-2` మేకర్స్ `తమ్మా` చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇందులో మెయిన్ లీడ్ కి రష్మికనే ఎంపిక చేసారు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. `యానిమల్` నుంచి మూడు సినిమాలు రానున్నాయి. వాటన్నింటిలోనూ రష్మిక హీరోయిన్ గా ఫిక్సై పోయింది. సాధారణంగా సీక్వెల్స్ వచ్చే సరికి హీరోయిన్లు మారుస్తుంటారు మేకర్స్. కానీ సందీప్ రెడ్డి వంగా మాత్రం ఆఛాన్స్ తీసుకోలేదు.
ఇలా రష్మిక చేతిలో ఇన్ని హిందీ సినిమాలున్నాయి. రష్మిక గనుక బాలీవుడ్ కి వెళ్లకపోయి ఉంటే వీటన్నింటిలో ఒక్కో ప్రాజెక్ట్ లో ఒక్కో హిందీ భామ సెట్ అయ్యేది. జాన్వీ కపూర్, సారా అలీఖాన్, అలియాభట్, అనన్యా పాండే లాంటి ఆ చిత్రాల్లో అవకాశం ఉండేది. లేదా అక్కడ స్టార్ కిడ్స్ ను ఆ చిత్రాల ద్వారా లాంచ్ చేసేవారు. రష్మిక ఆ ఛాన్సే లేకుండా చేసింది.