రష్మిక స్టైల్ మారినట్టు ఉందే! అలవాటయిందేమో!!
రష్మిక మందన్న.. వరుస హిట్స్ తో సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
రష్మిక మందన్న.. వరుస హిట్స్ తో సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నార్త్ టు సౌత్.. రోజురోజుకు తన ఫ్యాన్ బేస్ ను వేరే లెవెల్ లో పెంచుకుంటున్న ముద్దుగుమ్మ.. చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వరుస షూటింగ్స్ లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పుడు పుష్ప 2తో సందడి చేయనున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సీక్వెల్ లో రష్మిక.. శ్రీవల్లి 2.0గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్సెస్ లో తన లుక్స్ తో ఆకట్టుకున్న ఆమె.. ప్రమోషన్స్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మేకర్స్ నిర్వహించిన పాన్ ఇండియా అన్ని ఈవెంట్స్ లో పాల్గొన్నారు. తన కామెంట్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు.
నిన్న హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో రష్మిక.. ఓ రేంజ్ లో సందడి చేశారు. స్టేజ్ పై క్యాట్ వాక్ చేసిన ఆమె తన స్టెప్పులతో అలరించారు. గ్లామరస్ లుక్స్ తో ఫిదా చేశారు. అదే సమయంలో వేడుకను ఉద్దేశించి మాట్లాడారు. తెలుగు మూవీ టీమ్ అందరి కోసం ప్రస్తావించి ప్రశంసలు కురిపించారు.
దీంతో రష్మిక మాట్లాడిన వీడియో బిట్స్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆ సమయంలో రష్మిక స్లాంగ్.. కొత్తగా అనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ స్లాంగ్ లో విజయ్ దేవరకొండ మాట్లాడినట్లే రష్మిక స్లాంగ్ అనిపిస్తోందని అంటున్నారు. ఆమె వాయిస్, మాట్లాడే విధానంలో చాలా మార్పు వచ్చినట్లు తెలుస్తోందని చెబుతున్నారు.
విజయ్ దేవరకొండతో అలా మాట్లాడి.. రష్మిక స్లాంగ్ కూడా మారినట్లు ఉందని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆమె కర్ణాటకకు చెందిన ముద్దుగుమ్మ అని తెలిసిందే. కానీ ఇప్పుడు తెలుగు బాగానే నేర్చుకున్నట్లు అనిపిస్తుంది. చాలా పదాలు కరెక్ట్ గానే తెలుగులో పలికారు రష్మిక. మొత్తానికి పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలు నేర్చుకుంటున్నారేమో మరి!
అయితే విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీనిపై వారిద్దరూ ఎలాంటి ప్రకటన ఇవ్వక పోయినప్పటికీ పలు పిక్స్ దానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి! రీసెంట్ గా రష్మిక పుష్ప-2 చెన్నై ఈవెంట్ లో తాను ఇండస్ట్రీ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లు ధ్రువీకరించారు. మరెప్పుడు ఓపెన్ గా ప్రకటిస్తారో చూడాలి.