దీపికా పదుకొణే పాత్రని లాగేసుకున్న రష్మిక!
ఈ సక్సస్ తో బాలీవుడ్ లో అమ్మడి క్రేజ్ మరింత రెట్టింపు అయింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరీర్ టాలీవుడ్, బాలీవుడ్ లో జెట్ స్పీడ్ లో ఉంది. ఇటీవలే'పుష్ప-2'తో పాన్ ఇండియాలో మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది. ఈ సక్సస్ తో బాలీవుడ్ లో అమ్మడి క్రేజ్ మరింత రెట్టింపు అయింది. ఇప్పటికే హిందీలో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్ సరసన'సికిందర్' లో నటిస్తోంది. తెలుగు, హిందీలో లేడీ ఓరియేంటెడ్ చిత్రం'ది గర్ల్ ప్రెండ్' లో నటిస్తోంది. వచ్చే ఏడాది'ఛావా'తోనూ హిందీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
పాన్ ఇండియాలో'కుబేర' సినిమా చేస్తుంది. ఇలా వరుస ప్రాజెక్ట్ లతో రష్మిక క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఈ నేపథ్యంలో అమ్మడు మరో బాలీవుడ్ చిత్రానికి సైన్ చేసింది. షాహిద్ కపూర్ సరసన'కాక్ టైల్ -2కి ఎంపికైంది. ఇందులో సొగసరి మెయిన్ లీడ్ పోషిస్తుంది. మరో హీరోయిన్ రోల్ కోసం మేకర్స్ సెర్చ్ చేస్తున్నారు. మాతృకని తెరకెక్కించిన హోమీ అడజానీయా రెండవ భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు. మడాక్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
2012లో రిలీజ్ అయిన'కాక్ టైల్' ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇందులో సైఫ్ అలీఖాన్ , దీపికా పదుకొణే హీరోయిన్లగా నటించారు. దైనా పెంటీ, డింపుల్ కపాడియా , రణదీప్ హూడా, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. 35 కోట్ల బడ్జెట్ తో మడాక్ తో పాటు మరో రెండు సంస్థల భాగస్వామ్యంలో నిర్మాణమైంది. బాక్సాఫీస్ వద్ద 125 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రొమాంటిక్ కామెడీ కాక్ టైల్ కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు.
'కాక్ టైల్ 2' కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సీక్వెల్ ని తెరపైకి తెస్తున్నారు. సైఫ్ అలీఖాన పాత్రకి షాహిద్ కపూర్ ని, దీపికా పదుకొణే పాత్రలో రష్మిక మందన్నాని ఎంపిక చేసారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది పట్టాలెక్కించే అవకాశం ఉంది.