రష్మిక కేసు.. ఇంకా దొరకని క్రియేటర్!
ఇప్పటికే ఎక్స్ తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో రష్మిక డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసిన కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంటున్న విషయం తెల్సిందే. హీరోయిన్ రష్మిక మందన్న డీప్ నెక్ ఫేక్ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో లో ఉన్నది నూరు శాతం రష్మికనే అన్నట్లుగా మార్ఫింగ్ కు పాల్పడ్డారు. దాంతో ఇలాంటి ముందు ముందు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధం అయింది.
ఇప్పటికే ఎక్స్ తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో రష్మిక డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసిన కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎంక్వయిరీ చేసిన తర్వాత వెళ్లడి అయిన విషయం ఏంటి అంటే వారు ఆ వీడియోను క్రియేట్ చేయలేదు. సోషల్ మీడియాలో వారికి లభించిన వీడియోను షేర్ చేయడం జరిగిందట.
ఇప్పటికే ఫేక్ వీడియోను షేర్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధం అయిన పోలీసులు మరో వైపు రష్మిక డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన కేటుగాడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న వ్యక్తి ఆ వీడియోను క్రియేట్ చేసి ఉంటాడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏ దేశం లో ఆ వీడియో క్రియేటర్ ఉన్నా కూడా తెలుసుకుని అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫేక్ వీడియో మేకింగ్ కు సంబంధించిన యాప్స్ పై కూడా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రష్మిక ఫేక్ వీడియో కేసు విషయంలో చాలా సీరియస్ గా ఎంక్వయిరీ జరుగుతోందట.