విజయ్ ను చూసి రష్మిక ఎందుకు భయపడిందంటే?
వీరిద్దరినీ సిల్వర్ స్క్రీన్ పై మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటారు ఫ్యాన్స్.
సినీ ఇండస్ట్రీలో కొన్ని హీరో హీరోయిన్లు కాంబినేషన్లు ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఆన్ స్క్రీన్ పై తమ ఫేవరెట్ పెయిర్స్ ను చూసి అనేక మంది మురిసిపోతుంటారు. ఆ కాంబోస్ మళ్లీ ఎప్పుడు రిపీట్ అవుతాయని ఎదురుచూస్తుంటారు. అలాంటి పెయిర్స్ టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. అందులో మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. వీరిద్దరినీ సిల్వర్ స్క్రీన్ పై మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటారు ఫ్యాన్స్.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో జోడీగా నటించిన విజయ్, రష్మిక.. తమ కెమిస్ట్రీతో సినీ ప్రియులను మెస్మరైజ్ చేశారు. పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం మూవీ సూపర్ హిట్ గా నిలిచి.. మంచి వసూళ్లను రాబట్టింది. డియర్ కామ్రేడ్ మిక్స్ డ్ టాక్ అందుకుంది. అయితే గీత గోవిందం సినిమా నుంచి విజయ్, రష్మిక ఫ్రెండ్ షిప్ కొనసాగుతూనే ఉంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, అప్పుడప్పుడు వెకేషన్స్ కు వెళ్తుంటారని వార్తలు వస్తుంటాయి.
ఈ విషయంపై విజయ్, రష్మిక ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపారు. అయితే ఇప్పుడు విజయ్ పై రష్మిక చేసిన లేటెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాాయి. గీత గోవిందం సినిమా సెట్స్ లో విజయ్ ను తొలిసారి చూసి భయపడ్డానని తెలిపింది రష్మిక. ఆ సినిమా టైమ్ లో తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కొత్త వ్యక్తులతో అంత త్వరగా తాను కలవలేనని తెలిపింది రష్మిక. వారితో మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడతానని చెప్పింది. అందుకే గీతా గోవిందం మూవీ సమయంలో ఫస్ట్ టైమ్ విజయ్ తో కలిసి యాక్ట్ చేసేందుకు భయపడ్డానని గుర్తు చేసుకుంది రష్మిక. కానీ ఆయన చాలా కూల్ పర్సన్ అంటూ కొనియాడింది. విజయ్ వ్యక్తిత్వం అర్థమయ్యాక ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయామని పేర్కొంది.
విజయ్ తో కలిసి నటించడం చాలా ఈజీ అని చెప్పింది రష్మిక. ఆయన సెట్స్ లో ఉంటే.. మూవీ షూటింగ్ సాఫీగా సాగిపోతుందని తెలిపింది. సెట్స్ అంతా పాజిటివ్ గా ఉంటుందని వెల్లడించింది. అందరిలో కూడా స్పెషల్ పాజిటివ్ ఎనర్జీ నింపుతాడని పేర్కొంది. మరోసారి స్క్రీన్ పై ఎప్పుడు కలిసి కనిపిస్తారన్న ప్రశ్నకు ఇప్పట్లో ఎలాంటి ప్లాన్స్ లేవని తెలిపింది. ప్రస్తుతం రష్మిక కామెంట్స్ అండ్ ఇంటర్వ్యూ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.