ర‌ష్మిక న‌వ్వుతుంటే పువ్వులిలా మెర‌స్తాయా?

తాజాగా ర‌ష్మిక పుష్ప‌-2 షూటింగ్ స‌మ‌యంలో గ్యాప్ దొర‌క‌డంతో నెటి జ‌నుల్ని ఇలా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేసింది.

Update: 2024-07-17 07:09 GMT

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా? ఎక్క‌డ ఉంటే అక్క‌డ స‌ర‌దాగానే ఉంటుంది. ఆమె తో షూటింగ్ చేస్తుం టే సినిమా చేస్తున్నట్లు ఉండ‌దు. స‌ర‌దాగా ఆట‌లాడుకుంటున్న‌ట్లే ఉంటుంద‌ని హీరోలంటారు. అలా ర‌ష్మిక ఆఫ్ ది స్క్రీన్ పైనే కాదు..ఆన్ ది స్క్రీన్ పైనా కూడా సెట్స్ లో అంతే స‌ర‌దాగా ఉంటుంది. న‌వ్వ‌డం ఓ స‌ర‌దా అంటూ చుట్టూ ప‌క్క‌లున్న వారంద‌ర్నీ న‌వ్వించ‌డం ర‌ష్మిక స్టైల్. తాజాగా ర‌ష్మిక పుష్ప‌-2 షూటింగ్ స‌మ‌యంలో గ్యాప్ దొర‌క‌డంతో నెటి జ‌నుల్ని ఇలా న‌వ్వించే ప్ర‌య‌త్నం చేసింది.


త‌ల‌పై ఎర్ర గులాబీలు త‌ల‌ను స్టైల్ గా చూపించే ప్ర‌య‌త్నం చేసింది. త‌ల మ‌ధ్య‌లో అక్క‌డ‌క్క‌డా గులాబీలు త‌గిలించింది. ముఖంలో సంతోషాన్ని చూడొచ్చు. ఎంతో ఉల్సాసంగా క‌నిపిస్తుంది. సంతోష‌మంతా నా ద‌గ్గ‌రే ఉంది అనే ఫీలింగ్ నెటి జ‌నుల‌కు తీసుకొచ్చింది. కానీ వాస్త‌వంగా ఉన్న ఎమోష‌న్ మ‌రొక‌టి. ఆ ఎమోష‌న్ ని ఇలా బ‌య‌ట పెట్టింది.


'చాలా అనారోగ్యంగా ఉంది, కానీ 'ఫూలింగ్ చుట్టూ' ఆగడం లేదు అంటూ రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇక అభిమానుల కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం. ఓ అభిమాని ఇలా రాసాడు 'త్వరగా కోలుకో అందం. కష్టమైన రోజులో కూడా నీ ముఖంపై ..పెదాల‌పై చిరునవ్వు ఇంకా మెరుస్తూనే ఉంది. ఇది నీకెంతో అందంగా ఉంది` అన్నాడు.

ఇక ర‌ష్మిక బిజీ షెడ్యూల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్..బాలీవుడ్ అంటూ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ముంబై టూ హైద‌రాబాద్ తిరుగుతూ షూటింగ్ లు పూర్తి చేస్తోంది. లేడీ ఓరియేంటెడ్ సినిమాల‌కు సైతం ప్ర‌మోట్ అవ్వ‌డంతో ర‌ష్మిక లోన్యూ యాంగిల్ ని త‌ట్టి లేపే ప్ర‌య‌త్నాలు జోరుగా సాగుతున్నాయ‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News