అతడితో రష్మిక: దెబ్బకి మెంటల్ ఎక్కిపోవాలి!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ మామూలుగా లేదిప్పుడు. పాన్ ఇండియా లో అమ్మడు వెలిగిపోతుంది
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ మామూలుగా లేదిప్పుడు. పాన్ ఇండియా లో అమ్మడు వెలిగిపోతుంది. పుష్ప-2 తర్వాత అమ్మడు ఇంకే స్థాయికి చేరిపోతుందో? అన్న అంచనాలున్నాయి. ఇప్పటికే లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు కూడా సైన్ చేస్తోంది. అటు హీరోయిన్ గా..ఇటు ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో వెలిగిపోతుంది. బాలీవుడ్ లోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. యానిమల్ క్రేజ్ తో బడా నిర్మాణ సంస్థలే అమ్మడి కోసం వెయిట్ చేస్తున్నాయి.
అయినా రష్మిక మాత్రం టాలీవుడ్ ని వదలడం లేదు. బాలీవుడ్ కి వెళ్లినా మనసంతా టాలీవుడ్ పైనే కనిపిస్తుంది. పిలిస్తే పరిగెట్టుకుని సినిమా వేడుకల్లో పాల్గొంటుంది. అందులోనూ విజయ్ దేవరకొండ తమ్ముడు సినిమాల కోసమైతే అన్న దగ్గర లేకపోయినా రష్మిక మాత్రం అన్నీ తానై అన్నంతగా వ్యవరిస్తుంది. రష్మిక క్రేజ్ తోనే ఆనంద్ దేవరకొండ సినిమాలు మార్కెట్ లోకి వెళ్లిపోతున్నాయి. `గం గం గణేషా` ప్రీ రిలీజ్ వేడుకలో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా అమ్మడు బేబి డైరెక్టర్ సాయి రాజేష్ తో పనిచేయాలని ఉంది అన్న ఆసక్తిని వెల్లడించింది. తాను పనిచేయాలనుకుంటోన్న దర్శకుల్లో సాయి రాజేష్ కూడా ఒకరు అని తెలిపింది. అయితే ఆ పాత్ర చాలా యూనిక్ గా ఉండాలన్నారు. ఓ మెంటల్ క్యారెక్టర్ లా తన పాత్ర ని రాజేష్ డిజైన్ చేయాలన్నారు. అంటే రష్మిక అతడి డైరెక్షన్ లో ఎంత రఫ్ రోల్ పోషించాలనుకుంటోందో అర్దం చేసుకోవచ్చు . ఆ మెంటల్ పాత్రతో ప్రేక్షకులకు కూడా మెంటల్ ఎక్కించేలా ఉండాలి.
రాజేష్ అంతటి ఘనా పాటే. బేబి సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవిని స్టార్ గా నిలబెడ్డాడు. తనలో బోల్డ్ యాంగిల్ ని తట్టి లేపడంతో అమ్మడు వాయు వేగంతో కుర్రాళ్లకు దూసుకుపోయింది. ఆ సినిమా చూసి రష్మిక కూడా సర్ ప్రైజ్ అయిందని ఆమె మాటల్ని బట్టి తెలుస్తోంది. రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ దొరికి..దర్శకుడికి అన్ని రకాలుగా లిబర్టీస్ కల్పిస్తే సాయి రాజేష్ చెలరేగిపోతాడు. బేబిని మించి ఐటం బాంబ్ లా కుర్రాళ్లలోకు దూసుకుపోగలే పాత్ర రాయగలడు. రష్మిక అందుకు సంసిద్ధంగానే ఉంది. రాజేష్ కూడా అలాంటి మెంటల్ ఎక్కించే పాత్ర సృష్టిస్తే సరి.