కామిక్ కాన్ ఈవెంట్లో టైగర్ ష్రాఫ్‌తో రష్మిక మందన్న
శాన్ డియాగో కామిక్ కాన్‌లో `ప్రాజెక్ట్ కె` టీమ్ సందడి గురించి తెలిసిందే. ప్రభాస్ - కమల్ హాసన్- నాగ్ అశ్విన్ బృందం ఈ ప్రత్యేక ఈవెంట్లో సందడి చేసారు.
శాన్ డియాగో కామిక్ కాన్‌లో `ప్రాజెక్ట్ కె` టీమ్ సందడి గురించి తెలిసిందే. ప్రభాస్ - కమల్ హాసన్- నాగ్ అశ్విన్ బృందం ఈ ప్రత్యేక ఈవెంట్లో సందడి చేసారు. ఇదే వేదికపై టీజర్ ని లాంచ్ చేయగా వరల్డ్ క్లాస్ మూవీకి ఉండాల్సిన లక్షణాలన్నీ ప్రాజెక్ట్ కె కి ఉన్నాయని అంతా ప్రశంసించారు. కామిక్ కాన్ ఇండియా ఈవెంట్ గ్లామ్ అండ్ గ్లిజ్ తో కళకళలాడింది. ఈ మెగా ఈవెంట్ లో రష్మిక మందన్న .. బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ సహా పలువురు ప్రముఖ సినీ తారలు పాల్గొన్నారు.
కామిక్ కాన్ ఇండియా- క్రంచీరోల్‌తో భారతీయ యానిమేను సెలబ్రేట్ చేయడానికి రష్మిక- టైగర్ ఇద్దరూ జత కలిసారు. యానిమే సెగ్మెంట్ భారతదేశం అంతటా ఉన్న అనిమే అభిమానులను ఒకచోట చేర్చింది. టైగర్ ష్రాఫ్ - రష్మిక మందన ఇద్దరూ తోటి అనిమే అభిమానులతో సమావేశమయ్యారు. అనిమే పాత్రలు .. కాస్ ప్లేపై తమ పరస్పర ప్రేమను షేర్ చేసుకున్నారు.
టైగర్ ష్రాఫ్... డ్రాగన్ బాల్ Z నుండి గోకు వంటి ప్రముఖ యానిమే పాత్రల గురించి మాట్లాడి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. రష్మిక అనిమేతో తనకున్న అనుబంధం గురించి .. నరుటో నుండి నరుటో ఉజుమాకి పై తనకు ఉన్న అభిమానం గురించి ఓపెనైంది. దీని తర్వాత అనిమే ప్రేమికుల బృందం నరుటో షిప్పుడెన్ నుండి కాకాషి హటాకే ని చేయడం ఆసక్తిని కలిగించింది.
అనిమే అంటే?
అనిమే అనేది జపాన్ లో ఉద్భవించిన చేతితో గీసిన అలాగే కంప్యూటర్-సృష్టించిన యానిమేషన్. ఇది థియేటర్లలో టెలివిజన్ ప్రసారాల ద్వారా నేరుగా హోమ్ మీడియాకు ఇంటర్నెట్ ద్వారా పంపిణీ అవుతుంది. ఇది సముచిత ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని అనేక శైలులుగా వర్గీకరించబడింది. అనిమే అనేది విలక్షణమైన ఉత్పత్తి పద్ధతులతో కూడిన విభిన్న మాధ్యమం. ఇది గ్రాఫిక్ ఆర్ట్, క్యారెక్టరైజేషన్, సినిమాటోగ్రఫీ ఇతర రకాల ఊహాత్మక నటవిధానాలను పద్ధతులను మిళితం చేసే ఒక కళ.