ఏడాదికోసారి జపాన్ వేకేషన్ ఫిక్సైన బ్యూటీ!
ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక ఏడాదికోసారి తప్పకుండా జపాన్ వస్తానని అక్కడ అభిమానులకు ప్రామిస్ చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నేషనల్ క్రష రష్మిక మందన్నా ఇటీవల జపాన్ టోక్యో నగరంలో జరిగిన క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో భారత్ తరపున పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ భారత్ నుంచి ఏ నటికి ఇలాంటి అవకాశం రాలేదు. తొలిసారి ఆ ఛాన్స్ దక్కించుకున్న నటిగా రష్మిక గుర్తింపు దక్కించుకుంది. ఈ సందర్భంగా జపాన్ లో రష్మిక క్రేజ్ బయట పడింది. అమ్మడి కోసం ఎయిర్ పోర్టు వెలుపల ప్లకార్డులు పట్టుకుని గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.
ఇలాంటి గొప్ప ఆహ్వానం ఇంతవరకూ స్వదేశంలో కూడా చూడలేదు. దీంతో అమ్మడు తొలిసారి ఓ గొప్ప అనుభూతికి లోనైంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక ఏడాదికోసారి తప్పకుండా జపాన్ వస్తానని అక్కడ అభిమానులకు ప్రామిస్ చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతీ ఏడాది ఓ వెకేషన్ లా జపాన్ టూర్ వేస్తాననని తెలిపింది. చూడాల్సిన నగరం టోక్యా అని..చూడాల్సిన మరెన్నో అందాలు అక్కడ ఉన్నాయని సంతోషం వ్యక్తం చేసింది.
ఒక్కో ఏడాది ఒక్కో ప్రాతంలో నివసిస్తానని..అక్కడ బ్యూటీపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తానని తెలిపింది. మరి అక్కడ అన్ని ప్రత్యేకతలు ఏమున్నాయో చూడాలి. సాధారణంగా వెకేషన్ అంటే మాల్దీవులు.. యూరప్ ..స్విట్జర్లాండ్ లాంటి దేశాలు ఎక్కువగా వెళ్తుంటారు. కానీ రష్మిక అభిమానుల కోసం జపాన్ ని వెకేషన్ స్పాట్ గా మార్చేసుకుంది. మరి అణుబాంబు తో అతలాకుతలమైన నగరంలో అన్ని అద్భుతాలు ఏమున్నాయో చూడాలి.
రష్మిక మందన్నా పాన్ ఇండియా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప'తో పాన్ ఇండియా లో లాంచ్ అయిన అమ్మడు అటుపై రిలీజ్ అయిన 'యానిమల్' తో అంతకంతకు రెట్టింపు క్రేజ ని సొంతం చేసుకుంది. రష్మిక అంటే నేడు మార్కెట్ లో ఓ బ్రాండ్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. అమ్మడితో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు సైతం తెరకెక్కిస్తున్నారు.