ఆ పాట షూటింగ్ స‌మ‌యంలో నాకు పీరియ‌డ్స్!

బాలీవుడ్ సినిమా ‘మోహ్రా’లో ‘టిప్ టిప్ బరసా పానీ` వ‌ర్షం పాట‌ల్లో కల్లా ఓ సంచలనం. ఇందులో అక్షయ్ కుమార్-ర‌వీనా టాండ‌న్ జంట‌గా న‌టించారు.

Update: 2024-12-02 23:30 GMT

వ‌ర్షంలో చీర‌ధ‌రించి త‌డిసి ముద్ద‌యిన చీర‌లో డాన్సు చేయ‌డం అంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. స్పాట్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నో చెప్ప‌కుండా చేయాల్సిందే. కానీ బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి ర‌వీనా టాండ‌న్ మాత్రం అంత‌కు మించి చేసార‌ని చెప్పాలి. బాలీవుడ్ సినిమా ‘మోహ్రా’లో ‘టిప్ టిప్ బరసా పానీ` వ‌ర్షం పాట‌ల్లో కల్లా ఓ సంచలనం. ఇందులో అక్షయ్ కుమార్-ర‌వీనా టాండ‌న్ జంట‌గా న‌టించారు.

ఈ పాట యావత్ దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. రొమాంటిక్ గీతంలో ర‌వీనా హాట్ పెర్పార్మెన్స్ అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. అయితే ఈ పాట చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ర‌వీనా టాండ‌న్ ఎంత ఇబ్బంది పెడిందో? ఇప్ప‌టికే రివీల్ చేసింది. కాలికి మేకులు సైతం గుచ్చుకున్నా! బోరున కురిసే వాన‌లో ఎంతో క‌మిట్ మెంట్ తో ఆ పాట‌ను పూర్తి చేసింది. `నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో ఆ పాటను షూట్ చేశారు. చుట్టూ ఇనుప చువ్వలు, అపరిశుభ్ర పరిసరాలు దీంతో కాళ్లకు చెప్పుల్లేకుండా పాట షూట్‌లో పాల్గొన్న నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.

వర్షంలో చీర ధరించి అలాంటి మూమెంట్స్ చేయడం కోసం కష్టపడాల్సి వచ్చింది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు కాళ్లకు గాయాలు కాకుండా ఉండేందుకు నీ ప్యాడ్స్ వేసుకున్నా. ఇంటికి వెళ్లి చూసుకుంటే మోకాళ్లకు గాయాలయ్యాయి. చిన్న‌పాటి మేకులు లాంటివి గుచ్చుకున్నాయి. డాన్స్ చేస్తున్న స‌మ‌యంలో పెద్ద‌గా నొప్పి అనిపించ‌లేదు. కానీ ఇంటికెళ్లి చూసే స‌రికి అవి తీవ్ర‌మైన నొప్పికి దారి తీసాయి.

దీంతో వెంట‌నే డాక్ట‌ర్ ని సంప్ర‌దించి టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాను. జ్వ‌రం కూడా వ‌చ్చింది. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే ఆ పాట షూట్ స‌మ‌యానికి నేను పీరియ‌డ్స్ లో ఉన్నాను. చల్లటి నీటిలో అలాంటి ప‌రిస్థితుల్లో షూటింగ్ చేయ‌డం ఓ న‌ర‌కంగా అనిపించింది` అన్నారు.

Tags:    

Similar News